ఇండియా 272+ వాలంటీర్ వేదిక ప్రారంభం

ఈ పదాలతో బిజెపి ప్రచార సారథి నరేంద్ర మోడీ ప్రజాస్వామ్య ప్రక్రియలో సోషల్ మీడియా అత్యంత ప్రధానమైన పాత్ర పోషిస్తుందనే విషయాన్ని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
బిజెపి ప్రచార సన్నాహాల్లో భాగంగా వచ్చే శాసనసభ, లోకసభ ఎన్నికలకోసం ప్రచారం కోసం టెక్నాలజీని వాడుకోవడంపై దృష్టి కేంద్రీకరించి, పార్టీ జాతీయ కోశాధికారి, రాజ్యసభ సభ్యుడు పియూష్ గోయల్ నేతృత్వంలోని కమిటీతో పాటు పలు కమిటీలను ఏర్పాటు చేయడంలో భాగంగా మోడీ ఆ విషయాలు చెప్పి ఉండవచ్చు. ఇఐసిసిగా పిలిచే దాన్ని ఇటీవల ఢిల్లీలో ప్రారంభించారు. సోషల్ మీడియాలో ప్రజలు దాన్ని అనుసరిస్తున్నారు.
ఇఐసిసి గురించి ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ పియూష్ గోయల్ - "కనీసం ఏడు కోట్ల యువ ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోలేదు. వోటర్లుగా వారు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి, కీలకమైన రోజు వారు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వారిని చైతన్యవంతులను చేయాలని అనుకుంటోంది. ఈ లక్ష సాధన కోసం మా మిషన్ 272 ప్లస్ పనిచేస్తుంది" అని అన్నారు.
మిషన్ 272 పల్స్ వివరాలను చెబుతూ - "అవినీతిపై, దుష్పరిపాలనపై యువతలో పెరుగుతున్న ఆగ్రహాన్ని తమ వైపు తిప్పుకోవాలని బిజెపి ప్రణాళిక. యువత నూతన భారతదేశాన్ని నిర్మించాలని ఆకాంక్షిస్తోంది, తహతహలాడుతోంది. వారి గొంతుకు వేదికను అందించాలని మేం కోరుకుంటున్నాం" అని అన్నారు.
కొత్తగా ప్రారంభించిన వెబ్‌సైట్ http://www.india272.comలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రచారానికి ఏర్పాటైన మిషన్ 272 ప్లస్‌కు చోటు కల్పించడం జరిగింది.
పియూష్ గోయల్ వాలంటీర్లను సమీకరించే ముఖ్యంగా ఆ వెబ్‌సైట్‌తో మాట్లాడారు.
"ప్రారంభంలో ఆగస్టు చివరి నాటికి పదివేల వాలంటీర్లను, ఒక లక్ష ఆన్‌లైన్ వాలంటీర్లను సమీకరించుకోవాలనే లక్ష్యంతో బిజెపి పనిచేస్తోంది. ఎన్నికలు సమీపించేనాటికి ఈ సంఖ్య చాలా పెరుగుతుందని అంచనా, బిజెపి ప్రచారం కూడా వేగం అందుకుంటుంది. సందేశానికి సంబందించిన విషయాలపై, టెక్నాలజీ వాడకంపై, సామర్థ్య ఓటర్లను చేరుకోవడంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాం" అని అన్నారు.
సహజగంగాన్ భారీ ఔట్రీచ్ ప్రోగామ్‌లో వాలంటీర్లు వెన్నెముక అవుతారు, తప్పనిసరిగా టెక్నాలజీ ద్వారానే జరగాల్సి ఉంటుంది. ఈ వోటర్లను లక్ష్యం చేసుకోవడానికి బిజెపికి టెక్నాలజీ అందుబాటులో ఉందనే విషయాన్ని గోయల్ వివరించారు. ప్రతి వోటరుకు, అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలను పొందడానికి తన జట్టుకు సాఫ్ట్‌వేర్ ఉందని గోయల్ చెప్పారు.
http://www.india272.com వెబ్‌సైట్ ప్రత్యేక లక్షణం వాలంటీర్లకు ఉద్దేశించిన http://volunteer.india272.com అనే సబ్ సెక్షన్ ఉంది.
India272+ websiteలో ప్రారంభ మల్టీ పార్ట్ సిరీస్ బ్లాగ్‌స్పాట్స్ పోస్టు చేసిన సందర్భంగా సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ రాజేష్ జైన్ - సెంట్రాలిటీ ఆఫ్ బూత్ మేనేజ్‌మెంట్, క్రిటికాలిటీ ఆఫ్ వోటర్ ఎడ్యుకేషన్‌లతో పాటు మిషన్ టు వాలంటీర్ల గురించి వివరించారు.
ఇండియా 272 ప్లస్‌లో ఈ నెల 11వ తేదీన హైదరాబాదులో నరేంద్ర మోడీ చేయబోయే ప్రసంగంపై చాలా కవరేజీ ఉంది. హైదరాబాదులో పెద్దగా ప్రచారంలోని చిన్నపాటి విషయాలకు కూడా ఇందులో చోటు దక్కింది. 85 ఏళ్ల సీనియర్ సిటిజన్ నరేంద్ర మోడీ సభకు హాజరు కావడానికి చూపుతున్న ఉత్సుకతపై ముస్లిం మహిళ సైన్ చేయడాన్ని, తెలుగు దినపత్రిక ఈనాడులో రాసిన విషయాలను ఇందులో కవర్ చేయడం జరిగింది. ప్రధాన స్రవంతి మీడియాను పక్కన పెట్టి భౌగోళిక సరిహద్దులను, భాషా సరిహద్దులను అధిగమించి ప్రచారంలో టెక్నాలజీ, క్రౌడ్ సోర్సింగ్ శక్తిని ప్రదర్శించడం జరిగింది.
వారాలు, నెలలు గడుస్తున్నకొద్దీ ఈ వేదికను బిజెపి లోకసభలో 272+ సీట్లను ఎలా సాధించుకుంటుందనే తీరు రూపుదిద్దుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
"ఎన్నికలు, ప్రచారం వస్తాయి, పోతాయి, మన ప్రజాస్వామ్యాన్ని మరింత భాగస్వామ్యానికి అవకాశాన్ని కల్పించేదిగా, మరింత ప్రయోజనకరమైందిగా చేయడంలో ఈ మిషన్ రాజీ పడదు. జనాభాలో గణనీయంగా ఉన్న యువతను ప్రతిస్పందించే విధంగా తీర్చిదిద్దుతుంది".












Click it and Unblock the Notifications