ఆ ఇద్దరిపై బైరెడ్డి నిప్పులు, కెవిపి విషం కక్కారని హరీష్

విద్యుత్ పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు విడ్డూరమన్నారు. ఆయనకు సీమాంధ్ర ప్రాంతం పైన కపట ప్రేమ మాత్రమే ఉందన్నారు. సీమ ప్రాజెక్టులను ప్రభుత్వాలు నాశనం చేశాయన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పైన కిరణ్‌కు అవగాహన లేదన్నారు.
రామచంద్రయ్య రాజీనామా
రాష్ట్ర విభజనను నిరసిస్తూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వర్గం నేత, దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య మంగళవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని ఢిల్లీ నుండి ముఖ్యమంత్రికి ఫ్యాక్స్ చేశారు. రామచంద్రయ్య రాజీనామాతో రాజీనామా చేసిన మంత్రుల సంఖ్య పదమూడుకు చేరింది.
మరోవైపు ఢిల్లీలో పార్లమెంటు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసిన సీమాంధ్ర నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతారని తాము భావిస్తున్నామని మంత్రి శైలజానాథ్, విభజనపై పునరాలోచించుకోవాలని, సమైక్యంగా ఉంచే వరకు వివిధ రూపాల్లో ఉద్యమిస్తామని, వాస్తవ పరిస్థితిని పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామని మంత్రులు పార్థసారథి, గంటా శ్రీనివాస రావులు అన్నారు.
కొందరు నేతలు తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకొని మాట్లాడటాన్ని ఖండిస్తున్నానని పార్థసారథి చెప్పారు. అన్ని పార్టీలు అభిప్రాయం చెప్పాకే కాంగ్రెసు నిర్ణయం తీసుకుందన్నారు. యూపిఏకు బయటి నుండి మద్దతిస్తున్న పార్టీల అభిప్రాయాన్ని తీసుకోవాలని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి అన్నారు. ఆంటోనీ కమిటీ నుండి పిలుపు వస్తే తాము కలుస్తామని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.
కెవిపి విషం కక్కారు: హరీష్
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ఎంపి కెవిపి రామచంద్ర రావు రాజ్యసభలో విషం కక్కి సభ హుందాతనం పోగొట్టారని సిద్దిపేట తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు వేరుగా మండిపడ్డారు. తెలంగాణపై కాంగ్రెసు నిర్ణయం తీసుకోలేదని కెవిపి అసత్యాలు చెప్పారన్నారు. కరీంనగర్ సభలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై ప్రకటన చేసిన విషయం కెవిపి మర్చిపోయారా అని ప్రశ్నించారు.
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన నైజం బయటపెట్టుకున్నారన్నారు. సకల జనుల సమ్మె జరిగినప్పుడు, తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్నప్పుడు తదితర సందర్భాలలో ఆయన ఎందుకు స్పందించలేదన్నారు. తమ అరవై ఏళ్ల పోరాటం ఆయనకు గుర్తుకు రావడం లేదా అన్నారు.












Click it and Unblock the Notifications