టికి ఓకే అందుకే సీమకోసం అడుగుతున్నా: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని అందుకే సీమాంధ్రకు న్యాయం చేయాలని అడుగుతున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. సీమాంధ్రకు న్యాయం చేసేందుకు అఖిల పక్ష కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టిడిపి హయాంలో కేంద్రంతో పోరాడి హైదరాబాదుకు ఎన్నో సంస్థలను తెచ్చామన్నారు.

తాను తిరుపతి, నారావారిపల్లెను కాకుండా హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేశానన్నారు. అన్నదమ్ములుగా విడిపోవాలనుకున్నప్పుడు గ్రామ పెద్ద చేసే న్యాయం కూడా కాంగ్రెసు పార్టీ చేయలేదని మండిపడ్డారు. సీమాంధ్రకు న్యాయంపై అన్ని పార్టీల వారితో మాట్లాడాలన్నారు. ఎన్నికల సమయంలోనే కాంగ్రెసు పార్టీకి తెలంగాణ గుర్తుకు వస్తోందన్నారు. ఈ నాలుగేళ్లు ఏం చేశారని, ఎన్నికల ముందు నిర్ణయం తీసుకున్నార్నారు.

టిడిపిపై కుట్రతో రాష్ట్రంపై కుట్ర, కుతంత్రాలు వద్దన్నారు. విభజన పైన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విభజనపై సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. తెలంగాణపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం కాబట్టే సీమాంధ్రకు న్యాయం చేయాలంటున్నామన్నారు. కాంగ్రెసు ప్రజల జీవితాలతో ఆటాడుకుంటోందన్నారు. కాంగ్రెసును ఎంత తిడితే అంత బలపడుతుందని కేంద్రమంత్రి చిదంబరం అనడం విడ్డూరమన్నారు.

సున్నిత అంశాలపై ఎపి రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ రెచ్చగొడుతున్నారని నిప్పులు చెరిగారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన దానిని తాము పూర్తి చేశామని డిగ్గీయే చెబుతున్నారని కానీ, విభజన అపవాదును మళ్లీ తమ పైకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టల ఆరోపణలకు తాము సమాధానం చెప్పాలా అన్నారు.

రాష్ట్ర వ్యవహారంపై కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ ఎందుకని ప్రశ్నించారు. పిల్ల కాంగ్రెసు, తల్లి కాంగ్రెసు పార్టీలకు విమర్శించడం తప్ప మరొకటి లేదన్నారు. పంజాబ్, అసోం, జమ్ములో అల్లర్లకు కాంగ్రెసు పార్టీయే కారణమన్నారు. ఎమోషనల్ ఇష్యూ పైన అందర్నీ కూర్చుండబెట్టి మాట్లాడాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

కాంగ్రెసు పార్టీకి అధికారం ఇచ్చింది పరిస్థితి చక్కబెట్టేందుకని, చిచ్చు పెట్టేందుకు కాదన్నారు. విభజనపై ఎకె ఆంటోనీ వంటి పార్టీ కమిటీ కాకుండా జాతీయ పార్టీలతో, ప్రతిపక్షాలతో కలిసి అధికారిక కమిటీని వేయాలన్నారు. తెలుగు జాతి మధ్య చిచ్చుపెట్టాలనుకున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం సంప్రదింపులు జరిపే వారితో తాము మాట్లాడుతామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+