'సిఎం కనిపించుట లేదు': ధిక్కారమా అని శంకరన్న ఫైర్

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కిరణ్ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనేందుకు వెళ్లి, తెలంగాణ వైపు చూడడం లేదన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తక్షణమే కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించి రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో తెరాస జిల్లా నాయకులు సుజిత్, కార్తీక్, కిరణ్, సంతోష్, తదితరులు ఉన్నారు.
మరోవైపు సీమాంధ్ర వాసులను రెచ్చగొడుతూ, తెలంగాణ ప్రజలను కిరణ్ చేస్తున్నాడంటూ రంగారెడ్డి జిల్లా 11వ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది సుంకరి జనార్దన్ గౌడ్ ఈ ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన మేజిస్ట్రేట్ సెప్టెంబర్ 16వ తేదీలోగా విచారణ జరిపి, కేసు నమోదు చేయాలని సరూర్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.
కిరణ్‌పై శంకర రావు ఫైర్
తెలంగాణ ఉద్యమం సమయంలో నోరు విప్పని కిరణ్ ఇప్పుడు సీమాంధ్ర ఉద్యమానికి మద్దతిచ్చి హైకమాండ్‌ను ధిక్కరిస్తారా? అని మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర రావు హైదరాబాదులో ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యమంలో దివంగత ప్రధానులు రాజీవ్, ఇందిర గాంధీల విగ్రహాలు ధ్వంసం చేసిన వారిపై ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలని సిఎం, డిజిపిలను ప్రశ్నించారు.
ఒక్క ఎమ్మెల్యే మద్ధతు కూడా లేకుండా హైకమాండ్ ఆయనను ముఖ్యమంత్రిని చేశారన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సైతం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో వెనుకబడిందన్నారు.












Click it and Unblock the Notifications