భర్త ఘోరం: అందంగా లేదని భార్యను చంపాడు

విలాసాగర్‌కు చెందిన దుగ్యా ల కుమార్‌కు వీణవంక మండలం కల్లుపల్లెకు చెందిన మానుపటి రజిత(19)తో 14నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి అందంగా లేవంటూ భార్య రజితను వేధించసాగాడు. గురువారం భార్య రజితను వెంట పెట్టుకొని అత్తగారి ఊరు కల్లుపల్లెకు వెళ్లారు. శనివారం ఉదయం తిరిగివస్తూ మార్గమద్యం లో భార్యను చున్నీతో గొంతునులిమి హత్య చేశాడు. రెండు రోజులుగా రజిత ఆచూకీ తెలియరాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కుమార్‌ను నిలదీయడంతో తానే చంపేశానని చెప్పాడు.
చెరువులో పడి ఐదుగురు మృతి
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఐదుగురు మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా కురిచేడు మండలం గంగదొనకొండ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబంలోని ఇరువురు అన్నదమ్ములకు చెందిన సంతానం. గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికులు మీనిగ ఏడుకొండలు, రామయ్య అన్నదమ్ములు. వీరిలో పెద్దవాడైన ఏడుకొండలు భార్య తిరుపతమ్మ గ్రామంలోని రైతులకు చెందిన గేదెలను మేతకు తోలుకెళ్లింది.
పాఠశాలకు సెలవుకావడంతో ఆమెతోపాటు ఆమె కూతురు ఆదిలక్ష్మీ (15), కుమారుడు నరేంద్ర (11)లతో కలిసి మరిది కుమారుడు శివనాగేంద్ర (11), కూతురు భవాని (9) కూడా పెద్దమ్మతో కలిసి పశువులు మేపేందుకు పంటపొలాలకు బయలుదేరారు. పశువులను మేపుకుంటూ గ్రామంలోని తూర్పుచెరువువైపునకు వెళ్లారు. పశువులను చెరువు గట్టువైపునకు మళ్లించి వీరు కాళ్లు, చేతుల కడుక్కునేందుకు చెరువులోకి దిగారు. ఎవరు ముందు దిగారో తెలియదు. కాని నీటిలో మునిగిపోతున్న ఒకరిని కాపాడబోయి మరొకరు ఇలా ఐదుగురు నీట మునిగి ప్రాణాలు వదిలారు.












Click it and Unblock the Notifications