హైదరాబాద్‌పై చిరు, రాష్ట్రపతి పాలన ఉండదని బొత్స

విభజన నేపథ్యంలో అందరికీ సమ న్యాయం కావాలన్నారు. ఎకె ఆంటోనీ కమిటీకి తమ డిమాండ్లను, సమస్యలను వివరిస్తామని చెప్పారు. ఆంటోని కమిటీకి సమస్యలు వివరించినా ఎలా అమలు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రభుత్వపరంగా కమిటీ వేస్తే కమిట్‌మెంట్ ఉంటుందన్నారు. హైదరాబాదుతో భవిష్య్తత్తు ముడివడి ఉందని సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. రైతులకు నీరు పెద్ద సమస్యగా మారనుందన్నారు.
రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదు: బొత్స, ఢిల్లీకి ప్రయాణం
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ హైదరాబాదులో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రులే కాకుండా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ తమ అభిప్రాయం చెప్పారన్నారు. ఆంటోనీ కమిటీకి ప్రజల సందేహాలను తాము వివరిస్తామని చెప్పారు. ఆర్టీసి కార్మికులు దయచేసి సమ్మెను విరమించుకోవాలని కోరారు.
కార్మికుల ఆకాంక్షను తాము అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. విభజన ఓట్లు, సీట్ల కోసం జరగలేదన్నారు. కాంగ్రెసు పార్టీ అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తుందన్నారు. సమ్మె వల్ల ప్రజా జీవనం స్తంభించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబు ఇప్పుడు కాంగ్రెసు పైన నెపం వేయడం సరికాదన్నారు. సమైక్యాంధ్ర కోసం తాము ఆఖరి వరకు ఉద్యమిస్తామన్నారు. కాగా బొత్స ఈ రోజు ఢిల్లీకి బయలుదేరారు.
సమ్మెపై సిఎం సమీక్ష
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమ్మెపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ఉద్యోగుల హాజరు శాతంపై ఆరా తీశారు. తిరుమల కొండ పైన ఉన్న భక్తులను కిందకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications