సోనియా మనసు మార్చలేం: తెలంగాణపై జగ్గారెడ్డి

Jagga Reddy
సంగారెడ్డి/ వరంగల్: రాష్ట్ర విభజనపై యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదని ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై సోనియాగాంధీ నిర్ణయాన్ని ప్రకటించకముందే సమైక్యంగా ఉండాలని సీమాంధ్ర ప్రాంతవాసులు కోరి ఉంటే ఫలితం దక్కేదని అన్నారు. అయితే తాను ఇప్పటికీ సమైక్యవాదినే అని ఆయన అన్నారు.

యూపీఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ కోర్ కమిటీలతోపాటు ఇతర పార్టీల అభిప్రాయాలు సేకరించిన తరువాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని స్పష్టం చేశారు. కోస్తా, రాయలసీమవాసులను కూడా సంతృప్తి పరిచేందుకు కృషి చేయాలని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడంలో తప్పేమీ లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో మతరాజకీయాలే కీలకం కానున్నాయని తెలిపారు.

తెలంగాణలోని పెద్దపట్టణమైన హైదరాబాద్ విషయంలో మాట్లాడే హక్కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులకు లేదని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా సంగెం మండలంలోని బొల్లికుంట శివారులోని మహాలక్ష్మి గార్డెన్‌లో వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలకు చెందిన తెరాస సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ విషయంలో రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడం ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న ఇద్దరు నేతలు హైదరాబాద్‌లోని ఏ ప్రాంతంనుంచైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉందా అంటూ ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలు తలచుకుంటే ఒక్క ఓటుకూడా పడదని వారు గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపర్చినట్లేనని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+