మీవే అర్థంకావు కానీ: కిషన్, ఫోన్ నెంబర్ ఇచ్చిన బొత్స

Botsa Satyanarayana - Kishan Reddy
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రచార సారథి నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణకు లేదని, వారి పార్టీ నిర్ణయాలే ఆయనకు అర్థం కావని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోమవారం విమర్శించారు. బొత్సకు సొంత పార్టీ తీర్మానాలే అర్థం కావని, మోదీ వ్యాఖ్యలు ఎలా అర్థమయ్యాయని ప్రశ్నించారు.

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్, ఎపి కాంగ్రెస్ ఎంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు గనుక బొత్స ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్ ఓ దివాళాకోరు పార్టీ కాగా, దానికి ఆయన అధ్యక్షుడని విమర్శించారు. మోడీ ప్రసంగంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తావనపై ప్రశ్నించగా కాంగ్రెస్‌ను వ్యతిరేకించేవాళ్లంతా మద్దతివ్వాలని మాత్రమే ఆయన కోరారన్నారు. అంతేతప్ప టిడిపితో పొత్తు ప్రస్తావనే లేదని, ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని జవాబిచ్చారు.

మోడీ సభకు స్పందన బాగుందని, దేశవ్యాప్తంగా బిజెపి ప్రభంజనానికి ఇది సూచికని అభివర్ణించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి మామిడి దశరథ రెడ్డి, నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఆలూరు గంగా రెడ్డిసహా ఆ పార్టీ నేతలు పలువురు కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు.

ఫోన్ నెంబర్ ఇచ్చిన బొత్స

కాగా, కాంగ్రెసు పార్టీ అధిష్టానం నియమించిన ఆంటోని కమిటీకి అభిప్రాయాలు తెలియజేయదల్చుకున్న వారు 9581141230 నెంబర్‌కు ఎస్సెమ్మెస్ చేయవచ్చునని బొత్స ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు తదితరులకు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+