'ఎన్టీఆర్ చారిత్రక పాత్ర పోషించినందునే మోడీ పొగిడారు'

తెలుగు వారి బాధ్యత అందరికంటే తనకే ఎక్కువగా ఉందన్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... అందరికంటే ఎక్కువ బాధ్యత తన పైనే ఉందని చెప్పారు. సమస్య పరిష్కారానికి కృషి చేసే అందరితో కలిసి మాట్లాడుతామన్నారు. తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయానన్నారు. ఒకప్పుడు తెలుగు వారు ఇతరులకు చెప్పేవారని, ఇప్పుడు మనకే ఇతరులు కలిసి ఉండాలని చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు.
తాను ఇరు ప్రాంతాల కోసం ఉంటానని, అందరి సమస్యలు వింటానని, సమ న్యాయం డిమాండ్ చేస్తానన్నారు. తాను తిరుపతి, నారావారిపల్లె కంటే హైదరాబాదునే ఎక్కువగా అభివృద్ధి చేశానన్నారు. ఆంటోనీ కమిటీకి తాము నివేదిక ఎందుకిస్తామన్నారు. అది అధికారిక కమిటీ కాదని, కాంగ్రెసు పార్టీ కమిటీ అన్నారు. కాంగ్రెసు పార్టీ పైన 35 ఏళ్లుగా పోరాడుతున్నానని, అలాంటి పార్టీకి తాను నివేదిక ఎలా ఇస్తానన్నారు. కాంగ్రెసు కోర్ కమిటి ముందు చేతులు కట్టుకునే కర్మ తనకు లేదన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఇష్టానుసారంగా భూములు అమ్ముకుంటే తాను పోరాడానన్నారు. వాన్‌పిక్ కోసం 30వేల ఎకరాలు కావాలి కానీ రాజధానికి మూడువేల ఎకరాలు సరిపోతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ అంశం కాంగ్రెసు పార్టీకి సంబంధించిందని కాదని, రాష్ట్రానికి సంబంధించిందన్నారు. తెలంగాణ విషయంలో తాను రాజకీయాల గురించి ఆలోచించడం లేదని, ఇరు ప్రాంత ప్రజలకు న్యాయం కోసమే ఆలోచిస్తున్నానన్నారు.












Click it and Unblock the Notifications