జంతర్ మంతర్‌పై వెనక్కి!: ధర్నాలో చిరు, పురంధేశ్వరి

జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని కొందరు చెప్పగా... వద్దని మరికొందరు చెప్పారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అధిష్టానం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే కొందరు అక్కడే ధర్నా చేస్తామని చెప్పినప్పటికీ కేంద్రమంత్రులు వారిని వారించారు. దీంతో మాగుంట నివాసంలో ఉదయం హంగామాగా కనిపించింది.
ధర్నాపై మొదట నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కేంద్రమంత్రులు నచ్చజెప్పడంతో జంతర్ మంతర్ వద్ద రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంటులోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపాలని వారు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వారు గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో కేంద్రమంత్రులు కూడా పాల్గొన్నారు. కేంద్రమంత్రులు చిరంజీవి, కిల్లి కృపారాణి, పురంధేశ్వరి, జెడి శీలం, కావూరి సాంబశివ రావు, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సీమాంధ్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.
గవర్నర్‌ను కలువనున్న సీమాంధ్ర మంత్రులు
మరోవైపు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రుల సతీమణులు ఈ రోజు హైదరాబాదులో గవర్నర్ నరసింహన్‌ను కలువనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వారు ఆయనను కోరనున్నారు. విభజనతో జరిగే నష్టాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications