ఫేస్‌బుక్ మ్యారేజీ మిస్‌ఫైర్: భర్త తీసుకెళ్లాడు, అదృశ్యం

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండంలోని లంబాడిపల్లికి చెందిన దాసరి కరణాకర్ బిటెక్ పూర్తి చేశాడు. ఫేస్‌బుక్‌లో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన అక్షరశ్రీతో పరిచయం ఏర్పడింది. ఎంకాం చదివిన ఆమెతో అతను ప్రేమలో పడ్డారు.
గత నెలలో కరుణాకర్, అక్షరశ్రీ తిమ్మాపూర్ మండంలోని ఎల్ఎండి కాలనీ తాపాళ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ మర్నాడే ఆమె భరత్ సుబ్బారెడ్డి, బంధవులు వచ్చిన స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల సహాయంతో అక్షరశ్రీని తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత వారానికే ఆమె కనిపించకుండా పోయింది.
దాంతో వారు మళ్లీ ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కరుణాకర్‌ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అక్షరశ్రీకి రెండు కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications