పార్లమెంటు దుమారం: చిరు, జయప్రద ఇలా (ఫోటోలు)
న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రధానంగా వాద్రా భూ కుంభకోణం, కిష్త్వార్ హింసపై మంగళవారం దుమారం చెలరేగగా, ఆంధ్రప్రదేశ్ విభజన తగాదా పార్లమెంటు వెలుపల కనిపించింది. కాంగ్రెసు సోనియా గాంధీ అల్లుడు వాద్రాపై భూ కుంభకోణం ఆరోపణలతో రాజ్యసభ దుమారం చెలరేగింది. ఈ వ్యవహారంపై చర్చ చేపట్టాలని బిజెపి డిమాండ్ చేసింది.
భోజన విరామానికి ముందు ఓ విధమైన కార్యక్రమాలను చేపట్టలేకపోయింది. వాద్రాపై ఐఎఎస్ అధికారి అశోక్ ఖేమ్కా చేసిన ఆరోపణలపై తక్షణ చర్చ చేపట్టాలని బిజెపి డిమాండ్ చేసింది. పార్లమెంట్ సమావేశాలు ఉదయం పూట వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో డిప్యూటీ స్పీరక్ సభను మూడు గంటల వరకు వాయిదా వేశారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం ప్రారంభమైన దగ్గరనుంచి సీమాంధ్ర తెలుగుదేశం ఎంపీలు సమైక్యాంధ్రకు న్యాయం జరగాలని కోరుతూ నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకువెళ్ళి నినాదాలు చేశారు. దీంతో సభను రెండు గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన తర్వాత కూడా సభలో గందరగోళం నెలకొలకొంది. డిప్యూటీ స్పీకర్ ఎంత సర్ది చెప్పినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంట్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మంగళవారం కేంద్ర మంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కిల్లి కృపారాణి, జేడీ శీలం, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులు ఆందోళనకు దిగారు.

జయప్రదకు విఙజన సెగ లేదు..
లోకసభ సభ్యురాలు జయప్రద ఆంధ్రప్రదేశ్‌కు చెందినప్పటికీ విభజన సెగ ఆమెకు తాకడం లేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆమె లోకసభకు ఎన్నిక కావడమే అందుకు కారణం. ప్రస్తుత వర్షాకాలం పార్లమెంటు సమావేశాల సందర్భంగా బిజెపి ఎంపి భగకత్ సింగ్ కోష్యారితో కలిసి జయప్రద ఇలా..

కమల్‌నాథ్ సమావేశం
పార్లమెంటు కార్యక్రమాలను సజావుగా నడిపించడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ మంగళవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు ఫరూక్ అబ్దుల్లా, అజిత్ సింగ్. బిజెపి నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ.

కేంద్ర మంత్రి జైరాం రమేష్
పార్లమెంటు వర్షాకాలం సమావేశాల సందర్భంగా మంగళవారం పార్లమెంటు హౌస్‌లో కేంద్ర మంత్రి జైరాం రమేష్, ఇ. అహ్మద్ ఇలా...

కనిమొళి ఇలా..
పార్లమెంటు సమావేశాల స్తంభనకు స్వస్తి పలకడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి హాజరై బయటకు వస్తున్న డిఎంకె ఎంపి కనిమొళి...

పి. చిదంబరం, అరుణ్ జైట్లీ..
పార్లమెంటు సమావేశాలను సజావుగా నడిపించడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వెలుపలికి వస్తున్న ఆర్థిక మంత్రి పి. చిదంబరం, బిజెపి నేత అరుణ్ జైట్లీ..

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్
పార్లమెంటు సమావేశాలను సజావుగా నడిపించడానికి అఖిల పక్ష నేతలతో చర్చించిన తర్వాత సమావేశం నుంచి బయటకు వస్తున్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్..

ఫరూక్ అబ్దుల్లా...
పార్లమెంటు సమావేశాలను సజావుగా నడిపించడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి హాజరై బయటకు వస్తున్న కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా..

బిజెపి నేతలు
పార్లమెంటు సమావేశాల స్తంభనకు స్వస్తి చెప్పడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో బిజెపి నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ..

ములాయం సింగ్ యాదవ్...
పార్లమెంటు సమావేశాలను సజావుగా నడిపించడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి హాజరై బయటకు వస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్.

కేంద్ర మంత్రులు సమావేశంలో..
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ మంగళవారం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు పి. చిదంబరం, ఫరూక్ అబ్దుల్లా, అజిత్ సింగ్...

చిరంజీవి ఇలా ధర్నాలో..
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్లమెంటు ఆవరణలో నిర్వహించిన ధర్నాలో కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి, పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, కాంగ్రెసు ఎంపీలు మరింత మంది...

అద్వానీ, వెంకయ్య ఇలా..
మంగళవారం జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత పార్టీ సీనియర్ నేతలు ఎల్‌కె అద్వానీ, యశ్వంత్ సిన్హా, వెంకయ్య నాయుడు..

పార్లమెంటు హౌస్
పార్లమెంటు వర్షాకాలం సమావేశాల సందర్భంగా పార్లమెంటు హౌస్‌లో మంగళవారంనాడు శిరోమమి అకాలీదళ్ ఎఁపి హర్షిమ్రాత్ కౌర్, కేంద్ర మంత్రి సిస్ రామ్ ఓలా...

స్మృతి ఇరానీతో అద్వానీ..
పార్లమెంటు వర్షాకాలం సమావేశాల సందర్ఫంగా పార్లమెంటు హౌస్‌లో బిజెపి సీనియర్ నేత ఎల్ అద్వానీతో పార్టీ నాయకురాలు స్మృతి ఇరానీ...

బిజెపి నేతలు ఇలా..
న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు ఎల్‌కె అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రవి శంకర్ ప్రసాద్...

రాహుల్ గాంధీ ఇలా..
పార్లమెంటు వర్షాకాలం సమావేశాల సందర్భంగా కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంటు హౌస్‌లో పంజాబ్ కాంగ్రెసు చీఫ్ ప్రతాప్ సింగ్ బాజ్వాతో ముచ్చటిస్తూ ఇలా...












Click it and Unblock the Notifications