మేమే: నకిలీ ఒబామాపై డిగ్గీకి మోడి ఫ్యాన్స్ కౌంటర్

హైదరాబాదులోని సభలో మోడీ 'ఎస్ వియ్ కెన్' అంటూ నినాదం చేయించారు. దానిపై కాంగ్రెసు నేతలు విమర్శలు గుప్పించారు. మోడీ తన ప్రసంగం చివర్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తరహాలో నినాదం చేశారని ఎపి కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ అన్నారు. 'మనకు ఇప్పుడో నకిలీ దేశీ ఒబామా కూడా ఉన్నాడోచ్' అంటూ డిగ్గీ ట్విట్టర్‌లో స్పందించారు.
కాంగ్రెసు అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మాట్లాడుతూ... ఆమెరికా కంపెనీ రాసిపెట్టిన ఉపన్యాసాన్ని మోడీ బాగా చదివారంటూ ఎద్దేవా చేశారు. ఎవరో రాసిపెట్టిన ఉపన్యాసం చదవడం తప్పేమీ కాదని కానీ, ఆయన భారతీయ బృందం రాసిన ఉపన్యాసం చదివి ఉంటే బాగుండేదన్నారు. కానీ ఒక అమెరికా కంపెనీ తయారు చేసిన ఉపన్యాసం సాయంతో మాట్లాడారని విమర్శలు గుప్పించారు. ఇతర కాంగ్రెసు నేతలు కూడా ఒబామా స్టైల్లో అంటూ ఎద్దేవా చేశారు.
అయితే కాంగ్రెసు నేతల వ్యాఖ్యలకు మోడీ అభిమానులు కౌంటర్ ఇచ్చారు. వారు 2004 నాటి ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. 'ఐసపోర్ట్‌నమో' దీనిని అప్ లోడ్ చేసింది. వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్, 2004లో మోడీ 'గుజరాత్ కెన్ అండ్ గుజరాతీస్ విల్' అని వ్యాఖ్యానించారు. ఆ వేదిక పైన నాటి ప్రధానమంత్రి వాజపేయి కూడా ఉన్నారు.
<center><center><center><iframe width="600" height="338" src="//www.youtube.com/embed/-S2n4DSaa6U?list=UU1NF71EwP41VdjAU1iXdLkw" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>












Click it and Unblock the Notifications