సభలో టిడిపి ఎంపీల నిరసన: సుష్మాస్వరాజ్ విజ్ఞప్తికి నో

Sujana Chowdary - Sushma Swaraj
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలంటూ లోకసభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో స్పీకర్ మీరా కుమార్ సభను నాలుగు గంటల వరకు వాయిదా వేశారు. టిడిపి సభ్యులకు ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. దానిని వారు పట్టించుకోలేదు.

సేవ్ ఎపి అంటూ టి షర్ట్స్ ధరించి వచ్చిన టిడిపి ఎంపీలు సీమాంధ్రకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సభను అడ్డుకున్నారు. సుష్మా స్వరాజ్ కల్పించుకొని... సభ జరిగితేనే సమస్యలు పరిష్కారమవుతాయని, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. టిడిపి ఎంపీలు పట్టు వీడలేదు. దీంతో స్పీకర్ సభను నాలుగు గంటల వరకు వాయిదా వేశారు.

అంతకుముందు స్పీకర్ సభను పలుమార్లు వాయిదా వేశారు. ఎంపీలు పదే పదే సభను అడ్డుకుంటుండటంతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ అధ్యక్షతన అంతకుముందు అఖిల పక్షం భేటీ అయింది. సీమాంధ్రలో పరిస్థితులను చక్కదిద్దాలని టిడిపి ఎంపీలు నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరిలు కోరారు. వారి డిమాండు పైన కేంద్రమంత్రులు కమల్ నాథ్, చిదంబరంలు స్పందించలేదు.

రాజ్యసభను కుదిపేసిన కేరళ సోలార్ కుంభకోణం

మరోవైపు కేరళలోని సోలార్ స్కాం రాజ్యసభను కుదిపేసింది. ఓ వైపు ఓ వైపు విభజన, మరోవైపు స్కాం కారణంగా రాజ్యసభ అట్టుడికింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+