నీ మామనడుగు: హరీష్‌కి ఎర్రబెల్లి కౌంటర్, దేవినేని దీక్ష

Errabelli Dayakar Rao
హైదరాబాద్/విజయవాడ: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు వ్యక్తిగత విమర్సలకు దిగడం సరికాదని, నాడు ఎన్టీఆర్ విషయంలో ఏం జరిగిందో నీ మామ కల్వకుంట్ల చంద్రశేఖర రావును అడగాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం కౌంటర్ ఇచ్చారు. అప్పుడు కెసిఆర్ మంత్రిగా ఉన్నారని ఆయనను అడిగి తెలుసుకుంటే బాగుంటుందన్నారు.

రాష్ట్రం విడిపోయాక జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు. తెలుగు ప్రజలకు ఆయన అవసరముందన్నారు. సీమాంధ్ర ప్రజలకు కేంద్రం మనోధైర్యం ఇవ్వడం లేదనే తమ పార్టీ సీమాంధ్ర ఎంపీలు ఆందోళన చేస్తున్నారన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా కాదని వివరణ ఇచ్చారు. చంద్రబాబు కూడా పదే పదే తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నానని చెప్పారన్నారు.

రాజకీయ లబ్ధి కోసం టిడిపిని తిట్టే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. టిడిపి తెలంగాణకు వ్యతిరేకమనే భావనను ప్రజల్లో తీసుకు వచ్చేందుకు హరీష్ రావు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య తెరాస చిచ్చు పెడుతోందన్నారు. ఎకె ఆంటోనీ కమిటీ కాంగ్రెసు పార్టీ నేతలను సముదాయించేందుకే అన్నారు. తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ప్రేలాపనలు మానాలని హితవు పలికారు. హరీష్ రావు, కెసిఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే వారికి తెలంగాణ రావడం ఇష్టం లేనట్లుగా కనిపిస్తోందన్నారు.

రేపటి నుండి దేవినేని దీక్ష

సీమాంధ్రుల స్వాతంత్రాన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ హరించారంటూ టిడిపి సీనియర్ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం ఉదయం పది గంటల నుండి దీక్ష చేయనున్నారు. సోనియా తన కుమారుడి ఉద్యోగం కోసం సీమాంధ్రకు అన్యాయం చేశారని, కేంద్రం తన మొండి వైఖరిని వీడాలని మండిపడ్డారు. కేంద్రమంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు తదితరులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సోనియా ఏకపక్ష నిర్ణయంతో సీమాంధ్రను బలి చేశారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+