హర్ష ఇంట్లో ఎంపీల భేటీ, బర్త్‌డే వేడుకలకు వాణి దూరం

పుట్టిన రోజు వేడుకలకు వాణి దూరం
సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి తోట నర్సింహం భార్య వాణి చేపట్టిన ఆమరణ దీక్ష బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. విభజనను నిరసిస్తూ ఆమె తన పుట్టిన రోజు వేడుకలకూ దూరంగా ఉన్నారు. దీక్షా శిబిరం వద్ద చండీయాగం, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించనున్నారు.
కడపలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిల దీక్ష మూడో రోజు కొనసాగుతోంది. పెద్దాపురంలో టిడిపి నేత రాజబ్బాయ్ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జి.చరిత రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు.
కాగా, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి సందిగ్ధత తొలగిపోయింది. ఒక్క కృష్ణా జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ మంత్రులే జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కృషా జిల్లాలో మాత్రం అవనిగడ్డ ఉప ఎన్నిక కోడ్ కారణంగా జెండా ఆవిష్కరణ బాధ్యత జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు.
రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు కొంత మంది తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆగస్టు 15న జిల్లాల్లో జెండాను ఎవరు ఎగరవేస్తారనే అంశంపై కొంత సందిగ్ధత నెలకొంది. తమ రాజీనామాలు ఇంకా ఆమోదం పొందనందున జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీమాంధ్ర ప్రాంత మంత్రులు సుముఖత వ్యక్తం చేశారు. సీమాంధ్రలో సమ్మెకు దిగిన టీఎన్జీవోలు సైతం వేడుకలకు ఎలాంటి ఆటంకాలు కల్పించబోమని స్పష్టం చేశాయి.












Click it and Unblock the Notifications