విప్ ధిక్కరించిన సీమాంధ్ర ఎంపీలు, అంటోనీ కమిటీకి నో

Parliment
న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని డిమాండ్ చేస్తున్న సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు బుధవారం పార్టీ విప్ ధిక్కరించారు. యూపిఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లుపై సభలో చర్చ జరగనుంది. ఓటింగ్ కోసం కాంగ్రెసు పార్టీ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. సభ నుండి ఎవరూ బయటకు వెళ్లకూడదని ఆదేశించింది.

అయితే సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీలు పార్టీ విప్ ధిక్కరించారు. సమావేశాల నుండి బయటకు వచ్చారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. అంతకుముందు వారు సభలో నినాదాలు చేశారు. పార్టీ విప్ ఇచ్చిన నేపథ్యంలో సీమాంధ్రలో సమైక్య భావన తెలిపేందుకు విప్ ధిక్కరించారు.

మరోవైపు పార్టీ పరంగా సీమాంధ్ర సమస్యలు విన్నవించేందుకు వేసిన ఎకె ఆంటోనీ కమిటీని కలువకూడదని నిర్ణయించుకున్నారు. ఈ రోజు రాత్రి కేంద్రమంత్రులు ఆంటోని కమిటీని కలిసే అవకాశాలున్నాయి. రేపు ఉదయం ఎంపీలు కలుస్తారని భావించారు. కానీ, వారు మాత్రం ఆంటోనీ కమిటీని కూడా కలవకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రులు కూడా వెనుకడుగు వేస్తారా అనేది తేలనుంది.

కాగా, లోకసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. సభలో సీమాంధ్ర ఎంపీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో స్పీకర్ సభను వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+