సమైక్యమే: వైయస్ విజయమ్మ నిరవధిక నిరాహార దీక్ష

ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపలేనప్పుడు, న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం పది లోకసభ సీట్ల కోసం కాంగ్రెసు నాయకత్వం విభజనకు దిగిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు వైఖరి ఏకపక్షంగా, నిరంకుశంగా, రాజకీయ లబ్ధి కోసం వారికి తోచిన విధంగా చేయడానికి కుట్ర చేసినట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని విభజించాలనుకున్నప్పుడు ప్రాతిపదిక, హేతుబద్దత ఉండాలని, అదేమీ లేకుండా కాంగ్రెసు నాయకత్వం రాష్ట్ర విభజనకు పూనుకుందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ ఒంటెత్తు పోకడ పోతోందని ఆయన అన్నారు. ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కాంగ్రెసు ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం లేదని అన్నారు. ఒక ప్రాంతాన్ని మోసం చేసే విధంగా కాంగ్రెసు పార్టీ వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి మాటలను చూస్తుంటే ఒంటెత్తు పోకడతో వెళ్తున్నట్లు కనిపిస్తున్నాయని, దిగ్విజయ్ సింగ్ మాటలు ప్రజలను మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఇక్కడి ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేనది ఆయన అన్నారు. కాంగ్రెసు తన వైఖరిని ప్రకటించే వరకు తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని, దాన్ని ప్రభుత్వ విధానంగా చిత్రీకరించే ప్రయత్నాన్నిదిగ్విజయ్ సింగ్ చేస్తున్నారని, దీనివల్ల ప్రజలు రెచ్చిపోతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications