ఇద్దర్నీ హెచ్చరించాం, పార్టీలు షిండేకు చెప్పవచ్చు: డిగ్గీ

రాష్ట్ర విభజన చాలా సున్నితమైన అంశమన్నారు. సీమాంధ్రుల అభ్యంతరాలను తాము పరిగణలోకి తీసుకుంటామని, సీమాంధ్ర ప్రాంత ఎంపీలను తాము ఆంటోనీ కమిటీని కలవాలని ఆహ్వానించామన్నారు. ఇరు ప్రాంత నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దన్నారు. అందరికీ తాము హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఆంటోనీ కమిటి ఉందని, ఇక ప్రభుత్వం తరఫున మరో కమిటీ ఆవసరం లేదన్నారు. ఒకవేళ ప్రభుత్వ కమిటీ వేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
మెజార్టీ ప్రకారమే..: ఫరూక్ అబ్దుల్లా
మెజార్టీ ప్రజాఫ్రాయం ప్రకారమే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రి ఫరూక్ అబ్దుల్లా వేరుగా అన్నారు. విభజనపై అందరితో చర్చించి ఒప్పించే బాధ్యత కాంగ్రెసు పార్టీ పైనే ఉందన్నారు.
హైదరాబాద్ భీమాభవన్‌లో ఉద్రిక్తత
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని భీమా భవన్, విద్యుత్ సౌధ, సచివాలయాలలో సీమాంధ్ర ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు పోటా పోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. భీమా భవనంలో సీమాంధ్ర ఉద్యోగులకు తులసి రెడ్డి మద్దతు తెలిపేందుకు వచ్చారు. టి ఉద్యోగులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసులు తులసి రెడ్డిని లోపలకు ఆహ్వానించలేదు.












Click it and Unblock the Notifications