నేను ఉగ్రవాదిని కాను, నేనే భారత్ వస్తా: సయీద్

భారత్ తనను నిరంతరంగా ఉగ్రవాదిగా చెబుతోందని, తాను ఉగ్రవాదిని కానని, భారత్ సంతృప్తి చెందకపోతే తనపై భారత్, పాకిస్తాన్‌లకు చెందిన సీనియర్ న్యాయవాదులు, న్యాయమూర్తులతో న్యాయ సంఘాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆయన అన్నాడు.
న్యాయ సంఘం వచ్చే నిర్ధారణకు తాను అంగీకరిస్తానని ఆయన చెప్పాడు. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాహోర్‌లో జరిగిన ఓ సభలో ఆయన బుధవారం మాట్లాడాడు. తనను అప్పగించాలని భారత్ పాకిస్తాన్‌ను కోరడాన్ని ఆయన తప్పు పట్టాడు.
తన కోసం భారత్ ఆసక్తిగా చూస్తోందని, ఆందోళన వద్దని, తానే భారత్ వస్తానని సయీద్ అన్నాడు. భారతదేశంలోని ప్రతి ఒక్కరూ తనను ఉగ్రవాదిగా పిలుస్తున్నారని, కానీ తన పార్టీ చేపట్టిన వరద బాధితులకు చేసిన సహాయాన్ని చూడడం లేదని ఆయన అన్నాడు.
తాను భారతదేశాన్ని ఎప్పుడూ హెచ్చరించలేదని, భారత్ నైజాన్ని తాను ప్రపంచం ముందు బయటపెడుతున్నానని, వరద నీటిని యేటా పాకిస్తాన్‌లోకి వదులుతూ భారత్ తమను నాశనం చేస్తోందని ఆయన అన్నాడు. చట్టవిరుద్ధంగా తమ నీటిని వాడుకుంటూ విద్యుత్తును తయారు చేసుకుంటోందని అన్నాడు. కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలోని అమాయక కాశ్మీరీలను చంపుతున్నారని ఆయన ఆరోపించాడు.












Click it and Unblock the Notifications