శకటాలు అదుర్స్, గవర్నర్‌తో సిఎం టీ-బిస్కట్(పిక్చర్స్)
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయా రంగాలలో అత్యుత్తమ కనబర్చిన వారికి బహుమతులను, అవార్డులను ప్రదానం చేశారు. ముఖ్యమంత్రి జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో తెలంగాణ, సీమాంధ్రలను పక్కన పెట్టారు!
అనంతరం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్క రించుకుని గవర్నర్ నరసింహన్ పలు వురు ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు. గురువారం సాయంత్రం రాజ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి శాసన సభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క, మండలి ఛైర్మన్ చక్రపాణి, హైకోర్టు చీఫ్ జస్టిస్ జ్యోతిసేన్ గుప్తా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు శైలజానాథ్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, పితాని సత్యనారాయణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, సిపిఐ నేతలు నారాయణ, అజీజ్ బాషా, రామకృష్ణ, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, హైదరాబాద్ నగర మేయర్ మాజిద్ హుస్సేన్, ఎమ్మెల్యేలు జయసుధ, ఉన్నారు.
అలాగే పలువురు స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నేతలు, సీనియర్ ఐఏస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. గవర్నర్ తేనేటి విందు జరుగుతున్నంత సేపూ ముఖ్యమంత్రి ముభావంగానే కనిపించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో ఆయన కొంతసేపు ఏదో సమాలోచనలు చేస్తున్నట్లుగా కనిపించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా గవర్నర్‌ను కలిసిన మంత్రుల సతీమణులు తేనీటి విందుకు హాజరైనారు.

సాంస్కృతిక శాఖ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించిన శకటం మొదటి బహుమతిని గెలుచుకుంది. శకటంపై పూర్ణ కుంభం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి వట్టి వసంత్ కుమార్‌లు ఉన్నారు.

అటవీ శాఖ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించిన శకటం రెండవ బహుమతిని గెలుచుకుంది. ఆకట్టుకునేలా అటవీ శాఖ శకటం అలంకరించారు.

ఉద్యానవన శాఖ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించిన శకటం మూడో బహుమతిని గెలుచుకుంది. శకటంపై ఉద్యాన శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

కిరణ్‌తో గవర్నర్
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పలువురికి తేనీటి విందు ఇచ్చారు. రాజ్ భవన్ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానిస్తున్న నరసింహన్.

నరసింహన్ - స్పీకర్
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పలువురికి తేనీటి విందు ఇచ్చారు. రాజ్ భవన్ వచ్చిన సభాపతి నాదెండ్ల మనోహర్‌ను ఆహ్వానిస్తున్న నరసింహన్.

టీ బిస్కట్!
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పలువురికి తేనీటి విందు ఇచ్చారు. విందులో గవర్నర్‌తో కలిసి స్వీట్స్ తింటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

వచ్చిన ప్రముఖులు
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పలువురికి తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, సభాపతి నాదెండ్ల మనోహర్, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.

ప్రముఖులతో నరసింహన్
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పలువురికి తేనీటి విందు ఇచ్చారు. రాజ్ భవన్ వచ్చిన సిపిఐ కార్యదర్శి నారాయణ, ఇతరులు. పక్కన మంత్రి శైలజానాథ్.












Click it and Unblock the Notifications