వాణీ దీక్షకు కదిలిన అధిష్టానం, భగ్నం చేసిన పోలీసులు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి తోట నరసింహానికి ఫోన్ చేసి వాణి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దీక్ష విరమింపజేయాలని ఆయన మంత్రిని కోరారు. కేంద్ర మంత్రులు పల్లం రాజు, చిరంజీవి కూడా మంత్రికి ఫోన్ చేసి ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. దీక్ష విరమించి కమిటీకి ముందుకు రావాలని సూచించారు.
దీక్ష భగ్నం
మరోవైపు కాకినాడలో దీక్ష చేస్తున్న వాణి దీక్షను గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు భగ్నం చేశారు. గురువారం ఆమె దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, సుగర్ స్థాయి తగ్గుముఖం పట్టినట్లు డాక్టర్లు చెప్పారు. ఆరు కిలోల బరువు తగ్గారని, వెంటనే వైద్యం అందించకపోతే ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరించారు.
అయితే సమైక్య ప్రకటన వచ్చే వరకు దీక్షను విరమించేది లేదని ఆమె తేల్చి చెప్పారు. రాత్రి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఇటు కుటుంబసభ్యులు, కార్యకర్తలు ఉత్కంఠకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆమెను అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications