విజయమ్మపై నేతల ఫైర్, మద్దతుకు నో అన్న బాలరాజు

బూటకం: పొన్నం
వైయస్ విజయమ్మ దీక్ష బూటకమని కరీంనగర్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెసు పార్టీ నిర్ణయం దైవ నిర్ణయమని, శిలాశాసనమని అన్నారు.
దీక్షల పేరుతో డ్రామా: సోమిరెడ్డి
సీమాంధ్ర ప్రజల ఆందోళనకు కాంగ్రెసు పార్టీ సమాధానమివ్వాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజల సమస్యలు వినేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయాలన్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటును గుర్తించి 41 మంది ఎమ్మెల్యేలతో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఢిల్లీకి వెళ్లారని చెప్పిన విజయమ్మ, ఇప్పుడు దీక్షల పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.
దీక్షకు అనుమతించవద్దు: వివేక్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డిలు తెలంగాణ వ్యతిరేకులని, వీరిని పదవుల నుంచి తొలగించాలని తెరాస నేత, ఎంపి వివేక్ డిమాండ్ చేశారు. వీళ్లిద్దరు సీమాంధ్ర ప్రాంతానికే చెందిన వారుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో శాంతియుతంగా ధర్నాలు చేసిన వారిపై కేసులు నమోదు చేసిన డిజిపి సీమాంధ్ర ఉద్యమంపై వారిరువురు ఊదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు.
విధ్వంసం సృష్టిస్తోన్న సీమాంధ్ర ఉద్యమకారులపై తక్షణమే కేసులు నమోదు చేయాలని వివేక్ డిమాండ్ చేశారు. కిరణ్ తెలంగాణ వ్యతిరేకి అని తేలిపోయిందని వివేక్ పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టే వరకు తెరాసలోనే ఉంటానని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖాళీ ్యిందని, విజయమ్మ దీక్షకు అనుమతి ఇవ్వవద్దన్నారు.
ఉద్యమం ఉధృతం: ఎపిఎన్జీవోలు
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఎపిఎన్జీవోలు నిర్ణయించుకున్నారు. గుంటూరులో జరిగిన సమావేశంలో పలు అంశాలపై తీర్మానం చేశారు. సీమాంధ్ర జిల్లాల్లో ఈ నెల 19 నుండి ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని, 20 నుండి జాతీయ రహదారుల దిగ్బంధం, 21న మానవహారాలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రం దిగి వచ్చే వరకు సమ్మె చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications