సమైక్య: చిరుకి మామ విజ్ఞప్తి, వీరు పిల్లులు..!(పిక్చర్స్)

హైదరాబాద్/విశాఖ/రాజమండ్రి: సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సమ్మె, ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం స్వతంత్ర్య దినోత్సవం రోజు ఆయా ప్రాంతాల్లో ఆందోళనకారులు వినూత్నంగా నిరసన తెలిపారు.

రాష్ట్ర విభజనను అడ్డుకోలేని మంత్రులు జాతీయ పతాకావిష్కణకు అర్హులు కారంటూ సమైక్యాంధ్ర తిరుపతి ఐక్యకార్యాచరణ సమితి కేంద్రమంత్రులను పిల్లులుగా చిత్రీకరించింది. విద్యార్థులు పలుచోట్ల సమైక్యాంధ్ర కోసం ఆందోళన నిర్వహించారు. విద్యార్థులు పొట్టి శ్రీరాములు వేషధారణలో నిరసన తెలిపారు.

కాగా, రాష్ట్ర విభజనకు నిరసనగా త్వరలో హైదరాబాదులో ఉద్యోగులతో సదస్సు నిర్వహించనున్నట్లు ఎపిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు శుక్రవారం తెలిపారు. గుంటూరులో ఎపి ఎన్జీవో హోంలో జరిగిన సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెసు పార్టీ విభజన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జై సమైక్యాంధ్ర

జై సమైక్యాంధ్ర

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న విద్యార్థులు. ఆరుగురు విద్యార్థులు జై సమైక్యాంధ్ర అని రాసుకొని వరుసగా నిలబడిన దృశ్యం. పక్కన పొట్టి శ్రీరాములు, వివేకానంద స్వామి రూపంలో విద్యార్థులు.

వీరు మన పిల్లులు!

వీరు మన పిల్లులు!

సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయని కేంద్రమంత్రులు, ఎంపీలను పిల్లులతో పోలుస్తూ సమైక్యాంధ్ర తిరుపతి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ.

రాష్ట్రాన్ని విడగొట్టకండి

రాష్ట్రాన్ని విడగొట్టకండి

రాష్ట్రాన్ని విడగొట్టవద్దని కోరుతూ న్యూ మోడర్న్ బాయ్స్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న దృశ్యం. విద్యార్థులు సమైక్య ప్లకార్డులతో పాటు భారత దేశ పతాకలను పట్టుకొని నిరసన తెలిపారు.

అల్లుడుకి మామ...!

అల్లుడుకి మామ...!

పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో కేంద్రమంత్రి చిరంజీవికి సమైక్యవాదుల వినూత్న నిరసన. అల్లు రామలింగయ్య విగ్రహానికి సమైక్యవాదులు ఓ పోస్టర్ వేలాడదీశారు. అందులో అల్లు రామలింగయ్య చిరంజీవికి సమైక్యాంధ్ర కోసం సలహా ఇస్తున్నట్లుగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+