వైఎస్ వల్లే విభజన: సోమిరెడ్డి, విజయమ్మపై ఫైర్

తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి 41 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన నివేదికతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారని విజయమ్మ చెప్పారు. ఇప్పుడు నిరవధిక దీక్షలు ఆమె డ్రామాలు చేస్తున్నారని సోమిరెడ్డి విమర్శించారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ ముందు కేంద్ర మంత్రులు అస్త్ర సన్యాసం చేశారని ఆయన విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఇరు ప్రాంతాలవారిని రెచ్చగొట్టేలా మాట్టాదుతున్నారని, ఆంటోనీ పెదవి విప్పడం లేదని ఆయన మండిపడ్డారు. కనీసం బిజెపి నేత ఉమాభారతికి ఉన్న ఆదరణ కూడా దిగ్విజయ్ సింగ్‌కు లేదని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రం గొంతు కోస్తున్న దిగ్విజయ్ వెనుక కేంద్రమంత్రులు ఉంటారా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. సీమాంధ్రలు మనోభావాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడంలేదని, విభజనపై ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. సీమాంధ్ర ప్రజల ఆవేదన వినేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని వేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications