వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు 'న్యూస్ రీడర్' రాణి రుద్రమ గుడ్‌బై, బిజెపిలోకి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rani Rudrama
వరంగల్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి జిల్లాలో మరో షాక్ తగిలింది. న్యూస్ రీడర్ రాణీ రుద్రమ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఆమె నర్సంపేట నియోజకవర్గానికి కన్వీనర్‌గా ఉన్నారు. ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణపై ఆ పార్టీ యూ టర్న్ తీసుకోవడం వల్లనే ఆమె రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. రాణి రుద్రమ త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

రాణీ రుద్రమ నిరుడు నవంబరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తెలంగాణపై ఆ పార్టీ యూ టర్న్ తీసుకోవడంతో ఇతర సీనియర్ నేతల దారిలోనే ఆమె రాజీనామా చేశారు. రాణీ రుద్రమ తెలంగాణ ఛానెల్లో పని చేశారు.

ఆమెను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓ అసెట్‌గా భావించారని అంటారు. తెలంగాణ న్యూస్ చానెల్ టీ- న్యూస్‌లో యాంకరింగ్ ద్వారా, వార్తా పఠనం ద్వారా రాణి రుద్రమ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత నర్సంపేట నుండి పోటీ చేసేందుకు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

రాణీ రుద్రమకి రాజకీయానుభవం లేదు. కానీ ఆమె వెనక రాజకీయ దురంధరులు ఉండవచ్చుననే ఊహాగానాలు అప్పుడు వినిపించాయి. టివి యాంకర్‌గా ఆమె ప్రజలకు చిరపరిచితులయ్యారు. ఇప్పుడు జగన్ పార్టీ యూ టర్న్ తీసుకోవడంతో బిజెపిలో చేరేందుకు సిద్దమయ్యారట.

English summary
YSR Congress Party leader and Narsampet incharge 
 
 Rani Rudrama resigned to YSR Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X