మేమిద్దరం సమైక్యవాదులమే కానీ..: కెసిఆర్‌పై జగ్గారెడ్డి

ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులకు న్యాయం చేయాలని జగ్గారెడ్డి కోరారు. ఈ విషయమై తాను ఆంటోనీ కమిటీకి లేఖ రాసినట్లు చెప్పారు. అనేక ఏళ్లుగా జరుగుతున్న ఉద్యమాలలో విద్యార్థులను వాడుకొని వదిలేస్తున్నారని, వారికి న్యాయం జరగాలన్నారు. విద్యార్థుల సమస్యలపై చర్చకు రావాలన్నారు. అమరవీరుల కుటుంబాలకు పరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జాప్యం వద్దు: హరీష్
ఆంటోనీ కమిటీ పేరిట జాప్యం చేయకుండా ఈ పార్లమెంటు సమావేశాలలోనే బిల్లు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు వేరుగా డిమాండ్ చేశారు. సీమాంధ్రలో జరుగుతున్నది పెట్టుబడిదారుల ఉద్యమమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులు అన్నారు.
కెసిఆర్ ఎవరు?: పరకాల
హైదరాబాదులోని సీమాంధ్రుల భద్రతపై హామీ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎవరని విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ ప్రశ్నించారు. విభజన కోరే వారి పైన కేసులు పెట్టాలన్నారు. విభజన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమించాలన్నారు. కాగా విద్యుత్ సౌధ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. పోలీసులు అదుపుచేసే క్రమంగా పోలీసులు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది.












Click it and Unblock the Notifications