హైదరాబాద్ మా అబ్బసొత్తే, యుటికి నో: అంజన్ కుమార్

తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావుపై తిరుపతిలో దాడి చేయడాన్ని హైదరాబాద్‌పై దాడి చేయడంగానే పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ను కబ్జా చేసింది సీమాంధ్రులేనని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌ను స్థానికులు కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆయన సవాల్ చేశారు. బాంబుల సంస్కృతి తెచ్చి హైదరాబాద్‌ను పాడు చేశారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామనే సీమాంధ్ర నాయకుల ప్రకటనలను ఆయన ఖండించారు. హైదరాబాదుకు వచ్చి సీమాంధ్ర నాయకులు అభివృద్ధి చెందారని, హైదరాబాదును అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు. మాటలు తమకూ వస్తాయని, గౌరవించి గౌరవం తీసుకోవాలని ఆయన అన్నారు.
విజయమ్మ దీక్ష ఎందుకు: నాగం
ఏ ప్రయోజనాలు ఆశించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గుంటూరులో దీక్ష చేస్తున్నారో ప్రజలకు వివరించాలని బిజెపి నేత, శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం క్రెడిట్ ఎవరికి దక్కాలనే విషయంపై తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పోటీ పడుతున్నాయని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.
రాజకీయ ప్రయోజనం కోసమే కాంగ్రెసు సహా ఇతర పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయని నాగం అన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసే లోపు వెంటనే తెలంగాణ బిల్లును ప్రతిపాదించి ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications