తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపిని తెలంగాణ అన్నా అభ్యంతరంలేదు: గజల్ శ్రీనివాస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghazal Srinivas
చిత్తూరు/హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచి తెలంగాణ అని పేరు పెట్టినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ మంగళవారం అన్నారు. ఆయన ఈ రోజు తిరుపతిలో ఏర్పాటు చేసిన సింహ గర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తమ ఉద్యమం నేతల కోసం కాదని భావితరాల కోసమే అన్నారు.

కిరణ్‌ను కలిసిన ఎంపీలు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీలో ఈ రోజు పలువురు పార్లమెంటు సభ్యులు కలిశారు. లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు కలిశారు.

హైదరాబాద్ తెలంగాణదే: మందకృష్ణ

రాష్ట్ర రాజధాని హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హైదరాబాదులో అన్నారు. ఆస్తుల పరిరక్షణ కోసమే సమైక్య ఉద్యమమని ఆరోపించారు. బడుగులకు అధికారం దక్కకుండా కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు.

సహకరించండి: టిఎన్జీవో

విభజనకు సీమాంధ్రులు, సీమాంధ్ర ఉద్యోగులు సహకరించాలని టిఎన్జీవో నేతలు దేవి ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్‌లు వేరుగా కోరారు. తాము ఎవరిని రెచ్చగొట్టడం లేదన్నారు. ఈ నెల 22న సచివాలయంలో సద్భావన ర్యాలీలో పాల్గొంటామని చెప్పారు. శాంతియుతంగానే తాము ఈ నిరసన తెలుపుతామన్నారు. ప్రాంతాలుగా విడిపోయినా ఉద్యోగులుగా కలిసుందామన్నారు. విడిపోయినా సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరిగితే తాము అండగా ఉంటామన్నారు. సీమాంధ్రలో తెలంగాణ వారిపై దాడిని ఖండిస్తున్నానన్నారు.

English summary
Ghazal Srinivas participated in Samaikyandhra agitation at Tirupati of Chittoor district on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X