వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతలకి ఫోన్లో హరికృష్ణ పరామర్శ, అద్వానికి టిడిపి సిడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harikrishna
హైదరాబాద్/న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రాంత ప్రజల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల్లో నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులను, నాయకులను ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ మంగళవారం ఫోన్‌లో పరామర్శించారు.

అద్వానీ, సోనియాకు సిడిలు ఇచ్చిన టిడిపి ఎంపీలు

సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీలకు సిడిలు ఇచ్చారు. అనంతరం ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, సుజనా చౌదరి, కొణకళ్ల నారాయణ తదితరులు పార్లమెంటు ప్రాంగణంలో మాట్లాడారు. సీమాంధ్రకు న్యాయం జరిగే వరకు సభలో పోరాడుతామన్నారు. తమకు ఫుడ్ సెక్యూరిటీ బిల్లు కంటే లైఫ్ సెక్యూరిటీ ముఖ్యమన్నారు.

రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు తమతో కలిసి సభలో పాల్గొన్నారని విమర్శించారు. ఈ రోజు ఏడుగురు ఎంపీలు వచ్చారని, రేపు ఎందరు వస్తారో అన్నారు. సీమాంధ్రుల కోసం తాము సభలో ఉద్యమిస్తుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీమాంధ్రులపై టిడిపికి మాత్రమే చిత్తశుద్ధి ఉందన్నారు.

తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి సంక్షేమమే టిడిపి లక్ష్యమన్నారు. పార్లమెంటులో తాము ఉద్యమం కొనసాగిస్తామన్నారు. ప్రజల పక్షాన కేవలం టిడిపి మాత్రమే నిలబడగలదన్నారు. సీమాంధ్రకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.

English summary
Telugudesam Party MP Nandamuri Harikrishna has called party leaders on phone who are doing fast in Seemandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X