వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేనికైనా రె'ఢీ': సమైక్యం కోసం కిరణ్ పదవీ త్యాగం!?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Is Kiran ready to sacrifice?
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దేనికైనా సిద్ధమైనట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గతంలో ఢిల్లీ పెద్దల ముందు బలమైన వాదన వినిపించిన కిరణ్.. ఈ రోజు ఆంటోని కమిటీని కలువనున్నారు. ఆ కమిటీ ముందు ఆయన మరోసారి సమైక్య రాష్ట్రం కోసం మరిన్ని బలమైన వాదనలు వినిపించనున్నారట.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవసరమైతే తాను ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ఆంటోని కమిటీకి చెప్పనున్నారని సమాచారం. తాను ఎట్టి పరిస్థితుల్లో విభజనకు అంగీకరించేది లేదని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా అంగీకరించరని వారికి తేల్చి చెప్పనున్నారు.

సిడబ్ల్యూసి నిర్ణయం వెలువడినప్పటి నుండి సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో ఉద్యమం రోజు రోజుకు జోరందుకుంటోందని, విభజనకు అనుకూలంగానే ఉంటే కాంగ్రెసు పార్టీ తుడిచి పెట్టుకు పోవడం ఖాయమని ఆయన చెప్పనున్నారట. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచేందుకు తాను ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధమని, దానిని తెలంగాణ ప్రాంతం వారికి ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పనున్నారని ప్రచారం సాగుతోంది.

అధిష్టానం కిరణ్ విజ్ఞప్తిని మన్నిస్తుందా?

విభజనపై ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పిన కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయంపై వెనక్కి వెళ్లే అవకాశాలు ఏమాత్రం లేవంటున్నారు. అయితే హైదరాబాదు పైన మాత్రం పునరాలోచన చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయంటున్నారు. ఇప్పటికే హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రంగా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికి సీమాంధ్ర నేతలు ఒప్పుకుంటారు. కానీ, తెలంగాణ నేతల నుండి వ్యతిరేకత వస్తుంది.

కిరణ్ విజ్ఞప్తి చేసినా విభజనపై కాంగ్రెసు వెనక్కి తగ్గనప్పటికీ హైదరాబాదు విషయంలో మాత్రం ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. అదే సమయంలో హైదరాబాదుతో కూడిన తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో ఆందోళనకారులు శాంతించేందుకు ఏం చేయాలనే విషయమై కూడా కిరణ్‌తో పెద్దలు చర్చించే అవకాశాలున్నాయని సమాచారం.

English summary
According to TV reports... CM Kiran Kumar Reddy is ready to sacrifice his CM post for United Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X