ఢిల్లీ: గొడుగు పట్టిన అరుణ, ఆంటోనితో డిగ్గీ(పిక్చర్స్)
న్యూఢిల్లీ: విభజనపై సిడబ్ల్యూసి, యూపిఏ తీర్మానం నేపథ్యంలో తెలంగాణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి ఆంటోనీ కమిటీని కలిసి విన్నవించారు. హైదరాబాదును వదులుకునేది లేదని, పది జిల్లాలతో కూడిన హైదరాబాదు తమకు కావాలని వారు కమిటీకి తేల్చి చెప్పారు.
ఈ సమయంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ప్రజలు లేవనెత్తుతున్న అనుమానాలు, ఆందోళనలను టి నేతల దృష్టికి తీసుకు వెళ్లిన ఆంటోనీ కమిటీ వాటిపై ఏం చేద్దామని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదు పైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారా అని ప్రశ్నించారట.
మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన అనంతరం అక్కడి నుండి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుండి ఢిల్లీకి చేరుకున్నారు.

మీడియాతో డిగ్గీ
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు సోమవారం రాత్రి ఆంటోని కమిటీని కలిశారు. అనంతరం ఎపి రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతున్న దృశ్యం

డిగ్గీతో ఆంటోనీ
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సోమవారం రాత్రి ఆంటోని కమిటీని కలిశారు. ఈ సందర్బంగా ఎపి రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో కలిసి కారులో ఆంటోని.

డిప్యూటీ
సిడబ్ల్యూసి, యూపిఐ తీర్మానం నేపథ్యంలో తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆంటోని కమిటీకి చెప్పేందుకు ఇతర నేతలతో కలిసి ఢిల్లీకి వచ్చిన డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ.

డికె అరుణ, పొన్నాల, సునితా....
సిడబ్ల్యూసి, యూపిఐ తీర్మానం నేపథ్యంలో తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆంటోని కమిటీకి చెప్పేందుకు ఇతర నేతలతో కలిసి ఢిల్లీకి వచ్చిన మంత్రులు డికె అరుణ, సునితా లక్ష్మా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు.

జానా రెడ్డి
ఆంటోని కమిటీని కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని టి నేతలు కమిటీని కోరారు.












Click it and Unblock the Notifications