ఎవరు సమైక్యమనట్లేదు, విజయమ్మ దీక్ష డ్రామా: బొత్స

రాష్ట్ర విభజనపై అఖిల పక్ష సమావేశంలో సానుకూలంగా ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ పార్టీ నేతలు ఊసరవెల్లుల్లా మారుతూ దీక్ష చేస్తున్నారన్నారు. పార్టీ మనుగడ కోసం ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారన్నారు. అభిప్రాయం కోసం ప్రజల్లోకి వెళ్తానని తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరమన్నారు. 2008లో ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండానే ఆయన ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చారా చెప్పాలన్నారు.
అప్పుడు ప్రజల అభిప్రాయం అడగకుండా ఇప్పుడెలా అడుగుతారన్నారు. కాంగ్రెసు పార్టీ మెడలు వంచి తెలంగాణపై తీర్మానం పెట్టిస్తామన్న బాబు ఇప్పుడు ఎందుకు మాట మార్చారన్నారు. సున్నిత అంశాలను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరికాదన్నారు. అన్ని పార్టీలు అభిప్రాయం చెప్పాకే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుందని, సీమాంధ్ర కాంగ్రెసు నేతలు మాత్రమే సమైక్యానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు.
హరికి కడియం ప్రశ్న
స్వర్గీయ నందమూరి తారక రామారావును గద్దె దించినప్పుడు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణకు ఆయన నీతి వ్యాఖ్యలు గుర్తుకు రాలేదా అని తెరాస నేత కడియం శ్రీహరి వేరుగా ప్రశ్నించారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు.












Click it and Unblock the Notifications