జగన్ కేసు: ఐదు గంటలు ధర్మానను ప్రశ్నించిన సిబిఐ

బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వారిద్దరిని అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి) విజ్ఝప్తి మేరకు లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూములు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం జారీ చేసిన జీవోపై సిబిఐ అధికారులు తనను ప్రశ్నించినట్లు ధర్మాన ప్రసాదరావు చెప్పారు. విచారణ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
భూముల కేటాయింపు ప్రక్రియ గురించి తాను సిబిఐకి వివరించినట్లు ఆయన తెలిపారు. తనకు తెలిసిన వివరాలను సిబిఐ అధికారులకు తెలిపినట్లు చెప్పారు. సిబిఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని ధర్మాన అన్నారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు కేటాయించిన భూముల వినియోగం తీరు తన పరిధిలోకి రాదని, కేటాయించిన ప్రయోజనం కోసం వాటిని వాడారా, లేదా అనేది పరిశ్రమల శాఖ చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
సిబిఐ అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం చెప్పినట్లు ఆయన తెలిపారు. మళ్లీ రావాలని తనకు చెప్పలేదని ఆయన అన్నారు. వాన్‌పిక్ భూముల కేటాయింపు వ్యవహారంలో కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో ధర్మాన ప్రసాదరావు పేరును సిబిఐ నిందితుడిగా చేర్చింది.












Click it and Unblock the Notifications