హాట్‌లైన్ లేదని విజయమ్మ: నమస్కారం(దీక్ష పిక్చర్స్)

గుంటూరు: ఎవరివి వీధి నాటకాలో ప్రజలు గమనిస్తున్నారని, తమకు కాంగ్రెసు పార్టీతో హాట్ లైన్ లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ బుధవారం కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై మండిపడ్డారు. విజయమ్మ ఆమరణ దీక్ష గుంటూరులో మూడో రోజు కొనసాగుతుంది. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులపై ఆమె విమర్శలు గుప్పించారు.

రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. తమకు కాంగ్రెసు పార్టీకి హాట్ లైన్ ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు ఉండేవన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఎందుకుంటారని ప్రశ్నించారు. విభజన ద్వారా సమన్యాయం జరగాలని లేదంటే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులు ముందుగానే రాజీనామా చేశారని, అప్పుడే బాబు సహా అన్ని పార్టీల వారు రాజీనామాలు చేస్తే నిర్ణయం వెలువడకపోయి ఉండేదన్నారు.

విజయమ్మ దీక్ష

విజయమ్మ దీక్ష

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ దీక్ష మూడో రోజు కొనసాగుతోంది. రెండో రోజు దీక్షా ప్రాంగణంలో విజయమ్మ అభివాదం.

చిన్నారితో

చిన్నారితో

గుంటూరు దీక్ష ప్రాంగణంలో పసిపాపతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ దృశ్యం.

దీక్షా ప్రాంగణంలో...

దీక్షా ప్రాంగణంలో...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ దీక్షా ప్రాంగణంలో మద్దతు తెలుపుతున్న పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు.

నమస్కారం

నమస్కారం

విభజన జరిగితే ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని లేదంటే సమైక్యంగానే ఉంచాలని దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మకు నమస్కరిస్తున్న ఓ వ్యక్తి.

నేతలు

నేతలు

గుంటూరు ఆమరణ దీక్షా ప్రాంగణంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శోభా నాగి రెడ్డి, సుచరిత తదితరులు.

విజయమ్మ

విజయమ్మ

విభజన జరిగితే ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని లేదంటే సమైక్యంగానే ఉంచాలని దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ నమస్కరిస్తున్న దృశ్యం.

కాంగ్రెసు, టిడిపిలు ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బాబు స్టేలు తెచ్చుకున్నారని, చీకట్లో చిదంబరాన్ని కలిశారని ఆరోపించారు. జగన్‌ను, వైయస్ రాజశేఖర రెడ్డిని తిట్టే కార్యక్రమాన్నే బాబు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సమాధానాలు చెప్పవల్సిన ముఖ్యమంత్రి ప్రశ్నలు వేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం గాడి తప్పిందన్నారు. సీమాంధ్రలో ప్రజాగ్రహం ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదన్నారు.

విజయమ్మకు వైద్య పరీక్షలు

ఆమరణ దీక్ష చేస్తున్న వైయస్ విజయమ్మకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బిపి, పల్స్ సాధారణంగానే ఉన్నా నీరసించారని వైద్యులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+