బాబుకు సునీత 'రక్ష', దానంకు మహిళలు (పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ మహిళా నేతలు, ప్రజా ప్రతినిధులు బుధవారం రాఖీ కట్టారు. రక్షా బంధన్ సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో వారు అధ్యక్షుడికి రాఖీ కట్టారు.

రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, శాసన సభ్యులు పరిటాల సునీత, సీతక్క, సత్యవతి రాథోడ్, తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి తదితరులు బాబుకు రాఖీ కట్టి మిఠాయిని తినిపించారు. కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌కు కూడా పలువురు మహిళలు ఆయన కార్యాలయంలో రాఖీ కట్టారు.

రాఖీ కట్టిన వారికి ఉల్లిగడ్డలు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రక్షా బంధన్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. రాఖీ కట్టిన పలువురు మహిళలకు ఆయన ఉల్లిగడ్డలను బహుమతిగా ఇచ్చారు. కాంగ్రెసు పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని విమర్శించారు.

బాబుకు రాఖీ

బాబుకు రాఖీ

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రాఖీ కడుతున్న అనంతపురం జిల్లా రాప్తాడు శాసన సభ్యురాలు పరిటాల సునీత. చిత్రంలో సీనియర్ నాయకులు ఉన్నారు.

బాబుకు రాఖీ

బాబుకు రాఖీ

ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో రక్షా బంధన్ వేడుకలు జరిగాయి. పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు బాబుకు రాఖీ కట్టారు. బాబుకు రాఖీ కడుతున్న మహిళా నాయకురాలు.

బాబుకు రాఖీ

బాబుకు రాఖీ

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రాఖీ కడుతున్న తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు జరిగాయి.

రాఖీలతో బాబు

రాఖీలతో బాబు

పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు, ఇతరులు కట్టిన రాఖీలతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. బాబుకు రాఖీ కట్టేందుకు నాయకులు క్యూ కట్టారు.

బాబు చేతికి రాఖీలు

బాబు చేతికి రాఖీలు

పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు, ఇతరులు కట్టిన రాఖీలతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. పక్కన నవ్వుతున్న మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు.

దానంకు రాఖీ

దానంకు రాఖీ

కార్మిక శాఖ మంత్రి, హైదరాబాద్ నగరానికి చెందిన సీనియర్ కాంగ్రెసు నాయకులు దానం నాగేందర్‌కు రాఖీ కడుతున్న మహిళలు.

రాఖీలతో దానం

రాఖీలతో దానం

కార్మిక శాఖ మంత్రి, హైదరాబాద్ నగరానికి చెందిన సీనియర్ కాంగ్రెసు నాయకులు దానం నాగేందర్‌కు రాఖీ కడుతున్న మహిళల దృశ్యం.

మోడీకి మహిళ రాఖీ

మోడీకి మహిళ రాఖీ

గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీకి రాఖీ కట్టిన మహిళలు. పెద్ద సంఖ్యలో మహిలు మోడీకి రాఖీలు కట్టారు.

బహుమతిగా ఉల్లిగడ్డలు

బహుమతిగా ఉల్లిగడ్డలు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రక్షా బంధన్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. రాఖీ కట్టిన పలువురు మహిళలకు ఆయన ఉల్లిగడ్డలను బహుమతిగా ఇచ్చారు.

కెటి రామారావుకి రాఖీ కడుతున్న కవిత

కెటి రామారావుకి రాఖీ కడుతున్న కవిత

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కెటి రామారావుకి తన సోదరి కల్వకుంట్ల కవిత రాఖీ కడుతున్న వేళ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+