జైలు వద్ద జగన్ ఫోటోకి రాఖీ, అన్నకు షర్మిల 'రక్ష'

ఈ రోజు రక్షాబందన్. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు జగన్‌కు రాఖీ కట్టేందుకు వచ్చారు. జగన్ సతీమణి భారతి కూడా జగన్‌ను కలిసేందుకు జైలుకు వచ్చారు. ఆ తర్వాత షర్మిల సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చారు. వారు అధికారులతో మాట్లాడే అవకాశాలున్నాయి.
సిబిఐ ఎదుట హాజరైన ధర్మాన
మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు బుధవారం ఉదయం సిబిఐ ఎదుట హాజరయ్యారు. దిల్ కుశ అతిథి గకృహంలో సిబిఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. జగన్ కంపెనీలలో పెట్టుబడుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ ధర్మానకు సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద సిబిఐ నిన్న ఆయనకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
అనంతపురం జిల్లా ఇందూ కంపెనీకి సంబంధించి లేపాక్షి నాలెడ్జ్ ప్రాజెక్టుకు భూకేటాయింపుల వ్యవహారంలో ఆయనను సిబిఐ విచారిస్తోంది. కాగా, ఇప్పటికే ధర్మాన ప్రసాద రావు పైన సిబిఐ ఒక ఛార్జీషీటు దాఖలు చేసింది. ఆయన సిబిఐ ఎదుట హాజరు కావడం ఇది మూడోసారి.












Click it and Unblock the Notifications