వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నామా వాకౌట్: కాంగ్రెసు ఎంపిలపై టిడిపి ఎంపిల ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nama Nageswar Rao
న్యూఢిల్లీ: తమ పార్టీ సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ లోకసభ సభ్యుడు నామా నాగేశ్వరరావు శనివారం లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. సభ్యుల హక్కులను కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో మాట్లాడేందుకు నామా ప్రయత్నించగా, అందుకు స్పీకర్ మీరాకుమార్ నిరాకరించారు. నామా నాగేశ్వర రావుకు బిజెపి, ఎండియంకె, ఎస్పీ పార్టీ సభ్యులు మద్దతు తెలిపారు.

కాగా, కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులపై సస్పెన్షన్‌కు గురైన తెలుగుదేశం పార్టీ ఎంపీలు తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెసు పార్టీకి చెందిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి పోరాటానికి సిద్ధం కావాలని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణ డిమాండ్ చేశారు.

విందు సమావేశాలతో కాలయాపన చేయకుండా సీమాంధ్ర ప్రజల కోసం పోరాడాలని ఆయన వారికి సూచించారు. లోకసభ నుంచి సీమాంధ్ర సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమని సుజనా చౌదరి అన్నారు. సస్పెన్షన్ నిర్ణయాన్ని తిరిగి పరిశీలించాలని కోరుతూ స్పీకర్ మీరా కూమార్‌కు తాము లేఖ ఇచ్చినట్లు టిడిపి ఎంపీలు చెప్పారు.

తమ సస్పెన్షన్‌పై రాజ్యసభలో కెవిపి రామచందర్ రావు తదితర సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మౌనం వహించడాన్ని వారు తప్పు పట్టారు. కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులపై సమైక్యవాదులు ఒత్తిడి తేవాలని వారు కోరారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని వారు చెప్పారు.

English summary
Telugudesam MP Nama Nageswar Rao has staged walkout from Loksabha protesting against the suspension of Seemandhra MPs from the house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X