చిరు కనిపించుట లేదు, విజయమ్మ అరెస్ట్!(పిక్చర్స్)
హైదరాబాద్: సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో సమైక్యాంధ్ర కోసం 26వ రోజు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు తదితరులు సమైక్యాంధ్ర కోసం వివిధ రూపాల్లో నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వినూత్న నిరసనలు తెలిపే కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య మహిళ వేషధారణతో నిరసన తెలిపారు.
తెలంగాణ కోసం మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పైన ఎమ్మెల్యే టివి రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మందకృష్ణ ఎస్సీ వర్గీకరణను మర్చిపోయారా అని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటి కంటే ముందే వేసిన ఉషామెహ్రా కమిషన్ ఏమయిందో చెప్పాలన్నారు. కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు వర్గీకరణపై తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.
శాసన మండలి సభ్యుడు ఆదిరెడ్డి రాజమండ్రిలో జలదీక్ష చేపట్టారు. విశాఖ తగరపువలసలో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ దీక్ష చేస్తున్నారు. శ్రీకాకుళంలో అయ్యన్నపాత్రుడు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. విజయనగరంలో పలువురు సమైక్యవాదులు పంటపొలాలకు మందు పిచికారి చేసినట్లుగా.. పిసిసి చీఫ్ బొత్స, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ... ఇలా పలువురి ఫోటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి మందు కొట్టి నిరసన తెలిపారు.

చిరు కనబడుట లేదు
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కనబడుట లేదంటూ ఓ సమైక్యవాది చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రదర్శిస్తున్న దృశ్యం. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి చిరంజీవి కనిపించడం లేదంటూ కరపత్రాలు ముద్రించి, పంచుతూ నిరసన తెలుపుతున్నారు.

వైయస్ వల్లే
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లే రాష్ట్రానికి విభజన దుస్థితి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రదర్శిస్తున్న దృశ్యం.

ఎంపీ కొరడాతో కొట్టుకుంటున్న దృశ్యం
తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఎంపి శివ ప్రసాద్ సీమాంధ్రులకు న్యాయం చేయాలంటూ పార్లమెంటు ఆవరణలో కొరడాతో కొట్టుకుంటున్న చిత్రాన్ని తిరుపతిలో భారీ ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేసి ప్రదర్శించారు.

జై సమైక్యాంధ్ర
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో సమైక్యాంధ్ర కోసం ఓ జామపండల వ్యాపారి జై సమైక్యాంధ్ర అనే ప్లకార్డును తన నాలుగు చక్రాల బండికి తలిగించి అమ్ముతున్న దృశ్యం

ఆటతో నిరసన
ప్రకాశం జిల్లా ఒంగోలులో సమైక్యాంధ్ర కోసం రోడ్డు పైన షటిల్ ఆడుతూ నిరసన తెలుపుతున్న దృశ్యం. సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో సమైక్యాంధ్ర కోసం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

కర్ర సాము
చిత్తూరు జిల్లా తిరుపతిలో కర్రసాముతో నిరసన తెలియజేస్తున్న సమైక్యవాది. సీమాంధ్ర జిల్లాల్లో 26 రోజు కూడా సమైక్యాంధ్ర కోసం జోరుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

సచివాలయం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అందరిదీ అంటూ సచివాలయంలో నిరసన తెలియజేస్తున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు. వారు బెలూన్లతో తమ నిరసనను తెలిపారు.

హైదరాబాద్ ఫర్ ఆల్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అందరిదీ అంటూ సచివాలయంలో నిరసన తెలియజేస్తున్న ఓ ఉద్యోగిణి. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు బెలూన్లతో తమ నిరసనను తెలిపారు.

బతుకమ్మ ఆట
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని విద్యుత్ సౌధ వద్ద బతుకమ్మ ఆడుతూ నిరసన తెలుపుతున్న దృశ్యం. హైదరాబాదులో సమైక్య, తెలంగాణ ఉద్యోగులు తమ నిరసనలు తెలియజేస్తున్నారు.

హరీష్ రావు
గాంధీ మెడికల్ కళాశాలలో చేస్తున్న శాంతి దీక్షలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు. దీక్షలో టిపిజెఏసీ చైర్మన్ కోదండరామ్ తదితరులు.

విజయమ్మ
నాలుగు రోజులుగా ఆమరణ దీక్ష చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షులు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలోని దృశ్యం.












Click it and Unblock the Notifications