జగన్ దీక్ష కోసం రికమండ్ చేస్తాం: హరీష్, చిరుపై తెరాస

తెలంగాణలో జగన్ పార్టీ జెండా ఒక్కటి కూడా కనబడదన్నారు. ఇక్కడ దీక్ష చేపట్టి తమ అధికారులను ఇబ్బంది పెట్టవద్దని జగన్‌కు సూచించారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత మాట మార్చారన్నారు. రక్షణ కరువైంది సీమాంద్రులకు కాదని తెలంగాణ ప్రజలకన్నారు. నిజామాబాద్‌లో 70 వేలు, నల్గొండలో 80 వేలు, కరీంనగర్‌లో 50 వేలు, మెదక్‌లో 30 వేల సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారిని సోదరులుగా చూస్తున్నామన్నారు.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పైన తెరాస నేతలు హరీష్ రావు, కె కేశవ రావులు మండిపడ్డారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలంటే చిరంజీవి నాలుక కోస్తానని హెచ్చరించారు. తమ్ముడు బాలకృష్ణ కుమార్తె పెళ్లికి హాజరుకాని టిడిపి నేత హరికృష్ణ తెలుగు జాతి గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.
హైదరాబాదు సోదరులు చిరంజీవిని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు హైదరాబాదు గుండెకాయ వంటిదన్నారు. చిరు హైదారాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. చిరంజీవి కేంద్రం నుండి నిధులు తెచ్చుకొని రాజధానిని నిర్మించుకోవాలన్నారు. హైదరాబాదులేని తెలంగాణ గుండెలేని శరీరం వంటిదన్నారు.












Click it and Unblock the Notifications