వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదవి కోసమే శైలజానాథ్, రాయల టికి అవకాశం: జెసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: మంత్రి శైలజానాథ్ పదవీ వ్యామోహంతోనే సమైక్యవాదం వినిపిస్తున్నారని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యులు జెసి దివాకర్ రెడ్డి సోమవారం మండిపడ్డారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు నీరు కావాలంటే తెలంగాణ, ఉద్యోగాలు కావాలంటే హైదరాబాదు కావాల్సిందే అన్నారు. అధిష్టానం తీరు చూస్తుంటే సమైక్యతకు అంగీకరించేలా లేదన్నారు.

అందుకే తాము కర్నూలు, అనంతపురంలతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. ఆంటోని కమిటీ హావభావాలు రాయల తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని, రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్రలో తలెత్తే రాజధాని గొడవ సమసిపోతుందన్నారు. ఈ ప్రతిపాదనకు తెలంగాణ రాష్ట్ర సమితిలో సగం మంది, మజ్లిస్ పార్టీ అనుకూలంగా ఉందన్నారు.

ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీని తాము ఒప్పిస్తామన్నారు. త్వరలో కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలం భేటీ అవుతామని చెప్పారు. రాయల తెలంగాణ కాని పక్షంలో కర్నూలును రాజధాని చేయాలన్నారు. అయినా దానికి తాము అంగీకరించే అవకాశాలు తక్కువన్నారు. నీళ్లు, ఉద్యోగాల దృష్ట్యా తెలంగాణలోనే కలవాలనుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెసుకు డిపాజిట్లు కూడా రావన్నారు. శైలజానాథ్ ఒక్కడే పెద్ద పదవికి ఆశపడుతున్నారని, అందుకే సమైక్యవాదం వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఒకటే కష్టమేంటే మూడా?: జగ్గారెడ్డి

ఒక్క రాష్ట్రం ఇవ్వడమే కష్టంగా ఉంటే కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ మూడు రాష్ట్రాలుగా చేసి, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని చెప్పడం సరికాదని ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి వేరుగా అన్నారు. తాను సమైక్యవాదిని అని ధైర్యంగా చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని, ఆయనపై విమర్శలు చేయడం కేంద్రమంత్రికి సరికాదన్నారు.

English summary

 Former minister and Congress Party senior MLA JC Diwakar Reddy on Monday pitched in strongly for Rayala Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X