జగన్ కేసు: మంత్రి గీతారెడ్డికి షాక్, సిబిఐ సమన్లు

అనంతపురం జిల్లాలో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో తలపెట్టిన లేపాక్షి నాలెడ్జి హబ్ ప్రాజెక్టు విషయంలో సిబిఐ గీతారెడ్డికి ఆ సమన్లు జారీ చేసింది. రేపు గానీ ఎల్లుండి గానీ సిబిఐ అధికారులు గీతారెడ్డిని విచారించే అవకాశం ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ జీవోల విషయంలో సిబిఐ ఆమెను ప్రశ్నించనుంది.
వైయస్ జగన్ కేసులో మోపిదేవి వెంకటరమణ అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్నారు. అరెస్టయిన తర్వాత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. వైయస్ జగన్ కేసులో మరో ఇద్దరు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిని సిబిఐ నిందితులుగా చేర్చింది. చాలా రోజులు మంత్రులుగా కొనసాగిన వారిద్దరు చివరికి రాజీనామా చేశారు.
వైయస్ జగన్ కేసులో మొత్తం ఆరుగురు మంత్రులపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరో ఇద్దరు మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, పొన్నాల లక్ష్మయ్యలపై కూడా దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది. పొన్నాల లక్ష్మయ్యను సిబిఐ ఇదివరకు విచారించింది. కన్నా లక్ష్మినారాయణను విచారించాల్సి ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications