ఆమె కూతురుతో సమానం: లైంగిక ఆరోపణలపై ఆశారాం

Asaram Bapu
ఇండోర్: లైంగిక దాడి అభియోగాలు ఎదుర్కొంటున్న ఆశారాం బాపు తనపై వచ్చిన ఆరోపణలను కొట్టి పారేశారు. ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని, తాను అమాయకుడ్నని చెప్పారు. ఆ మైనర్ బాలికను తాను కూతురిగా భావిస్తున్నానని చెప్పారు. ఇలాంటి బాలికను మానభంగ బాధితురాలిగా చిత్రీకరించడం తనకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించిందని అన్నారు. ఓ విస్తృత కుట్రలో భాగంగా సాధువులను భ్రష్టు పట్టిస్తున్నారని తన ఆశ్రమంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన అన్నారు.

తాను తన ప్రవచనాల్లో హిందూమతం గురించి దాని విలువల గురించి చెబుతున్నాను కాబట్టి నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, నాలుగు దశాబ్దాలుగా తనపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయని, ఒక దశలో చేతబడి, తాంత్రిక విద్యలు ప్రయోగిస్తున్నానని కూడా తనపై ఆరోపణలు వచ్చాయని చెప్పారు. ఇలాంటివేవీ న్యాయ పరీక్షకు నిలబడ లేదన్నారు. తనపై జూలై, ఆగస్టు నెలల్లోనే ఈ తరహా ఆరోపణలు వస్తున్నాయని, అందుకు కారణం కొన్ని రకాల కుత్సిత శక్తులు బయటికి రావడమేనని అన్నారు.

మానభంగం కేసులో ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసుల ముందుకు హాజరు అవుతారా అన్న ప్రశ్నకు కూడా అయన నేరుగా సమాధానం చెప్పలేదు. ఏ నేరం చేయకుండా జైళ్లలో ఉన్న వారి కోసం దేశ వ్యాప్తంగా ప్రవచనాలు చేస్తానని అవసరమైతే వారికి న్యాయ సహాయాన్ని అందిస్తానని వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు ఆశారాం బాపుకు సమన్లు జారీ చేశారు.

కాగా, ఆశారాం బాపుపై ఢిల్లీ పోలీసులు లైంగిక దాడి ఆరోపణలపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఓ 16 ఏళ్ల బాలికపై ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు మధ్య ఢిల్లీలోని కమలా మార్కెట్ పోలీసు స్టేషన్‌లో 376 సెక్షన్ కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. జోద్‌పూర్‌లో ఓ బాలిక అత్యాచారానికి గురైన సంఘటనకు ఈ కేసు సంబంధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+