వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపికి కాంగ్రెస్ సంఘీభావం, ఢిల్లీలో కెసిఆర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: సిడబ్ల్యూసి, యూపిఏ విభజన నిర్ణయం ఆంధ్ర ప్రదేశ్‌లో వేడి రాజేయగా, ఢిల్లీలో మన నేతలు బిజీ బిజీ అయ్యారు. రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ కొందరు, విభజనను వ్యతిరేకిస్తూ మరికొందరు ఎంపీలు, నేతలు ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు. చర్చలు జరుపుతున్నారు.

పార్లమెంటు ఉభయ సభల్లో టిడిపి సభ్యులు ఆరుగురు, కాంగ్రెసు సభ్యులు ఎనిమిది మంది సస్పెండ్ అయ్యారు. సస్పెండైన టిడిపి ఎంపీలు పార్లమెంటు ఆవరణలోనే దీక్ష చేపట్టారు. వారి దీక్షను పోలీసులు సోమవారం రాత్రి భగ్నం చేశారు. ఇరు ప్రాంతాల కేంద్రమంత్రులు, కాంగ్రెసు ఎంపీలు ఎవరికి వారు తమకు అనుకూలంగా లాబీయింగ్ చేస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ ప్రకటించినందున సీమాంధ్ర నేతల ఒత్తిడితో వెనక్కి వెళ్లకుండా తెలంగాణ కాంగ్రెసు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎలాగైనా విభజనను అడ్డుకోవాలని సీమాంధ్ర నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్రలో విభజనకు వ్యతిరేకంగా, తెలంగాణలో త్వరగా పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాదు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇరు ప్రాంత ఉద్యోగుల మధ్య పోటా పోటీ కనిపిస్తోంది.

శాంతి దీక్ష

శాంతి దీక్ష

పార్లమెంటులో తెలంగాణ బిల్లును వెంటనే పెట్టాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని నెహ్రూ సెంచరీ ట్రైబల్ మ్యూజియం ఎదుట శాంతి సద్భావన దీక్ష ర్యాలీ నిర్వహిస్తున్న తెలంగాణ ఐకాస

 టిడిపి

టిడిపి

సేవ్ ఆంధ్ర ప్రదేశ్, వి డిమాండ్ జస్టిస్ ఫర్ సీమాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ లోకసభ నుండి సస్పెండైన తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తున్న దృశ్యం. వారి దీక్షను భద్రతా సిబ్బంది భగ్నం చేసింది.

కెసిఆర్

కెసిఆర్

విభజన నిర్ణయం నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

టిడిపికి కాంగ్రెసు సంఘీభావం

టిడిపికి కాంగ్రెసు సంఘీభావం

పార్లమెంటు ఆవరణలో దీక్ష చేస్తున్న సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలకు సోమవారం సంఘీభావం తెలుపుతున్న సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ఎంపీలు.

లగడపాటి, అశోక్ బాబు

లగడపాటి, అశోక్ బాబు

సమైక్యాంధ్రకు జాతీయ పార్టీల నేతలను కలిసి వారి మద్దతును కూడగట్టేందుకు ఢిల్లీకి వచ్చిన ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుతో విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్.

లగడపాటి

లగడపాటి

ఢిల్లీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్. సమావేశంలో ఎంపీలు కనుమూరి బాపిరాజు, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు.

మహాత్మా గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తున్న టిడిపి ఎంపీలు

మహాత్మా గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తున్న టిడిపి ఎంపీలు

సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తున్న టిడిపి ఎంపీలు. అక్కడే నిద్రిస్తున్న దృశ్యం. వీరి దీక్షను భద్రతా సిబ్బంది సోమవారం భగ్నం చేశాయి.

English summary
Protests continued across Coastal Andhra and Rayalaseema regions on Tuesday against the proposed division of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X