రాష్ట్రం విడిపోదని కిరణ్, సంక్రాంతి లోపే టి అని డిఎస్

సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. విభజన ప్రకటన పరిణామాలతో సీమాంధ్ర ప్రాంతంలో పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తమైంది. విభజన జరగదన్న ధీమాను ఈ సమయంలో ముఖ్యమంత్రి వ్యక్తం చేశారట. అసెంబ్లీలో తీర్మానం ఎప్పుడు వస్తుందని మంత్రులు ప్రశ్నించగా, దానిపై తనకు అవగాహన లేదని, కానీ తీర్మానం వీగిపోతుందని, విభజన జరగదని ఆయన స్పష్టం చేశారట.
సంక్రాంతికి ముందే టి: డిఎస్
హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణ సంక్రాంతికి ముందే ఖాయమని మాజీ పిసిసి అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్ వేరుగా అన్నారు. సీమాంద్రులు ఎన్నిరకాల ఒత్తిళ్లు తెచ్చినా, ఎన్ని ఆందోళనలు చేసినా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం మారబోదని స్పష్టం చేశారు.
ఆయన నిజామాబాద్ జిల్లాలో ఓ కార్యాక్రమంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని చెప్పారు. యాభై ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ఫలితంగానే సోనియా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలతో చర్చించి ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని ప్రకటించారు.












Click it and Unblock the Notifications