హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద్రాబాద్‌కి గడ్డుకాలమే: జగ్గారెడ్డి, తరిమేశారని ఎంపీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jagga Reddy
మెదక్/న్యూఢిల్లీ: తెలంగాణ వస్తే హైదరాబాద్‌కు గడ్డుకాలమేనని, మజ్లిస్ ఆధిపత్యమే ఉంటుందని సంగారెడ్డి శాసన సభ్యుడు, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గా రెడ్డి) మంగళవారం అనుమానం వ్యక్తం చేశారు. విభజన జరిగితే హైదరాబాద్ మరో పాకిస్తాన్‌లా మారటం ఖాయమన్నారు. మతపరమైన రాజకీయాలో ఉంటాయన్నారు. హైదరాబాదులో ఐఎస్ఐ ఏజెంట్లు ఉన్నారని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు.

రేపు ఢిల్లీకి సచివాలయ ఉద్యోగులు

తాము రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాదులో చెప్పారు. ఆంటోని కమిటీని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతామన్నారు. ప్రతిపక్ష నేతలను కూడా కలుస్తామన్నారు. మూడు రోజులుగా తాము విధులకు హాజరవుతున్నామని, భోజన విరామ సమయంలో మాత్రమే ఆందోళన చేస్తున్నామన్నారు.

దాడి చేయలేదు: సమైక్యాంధ్ర జెఏసి

తాము తెలంగాణ ఉద్యోగుల పైన దాడులు చేయలేదని సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి ప్రకటించింది. మార్ఫింగ్ చేసి తమను బద్నాం చేస్తున్నారన్నారు. కాగా, ఢిల్లీలోని ఎపిఎన్జీవో ఉద్యోగులు ప్రధానమంత్రితో పాటు బిజెపి, అన్నాడిఎంకె, టిఎంసి, సిపిఎం నేతలను కలిశారు.

మార్షల్స్‌తో తరిమేశారు: టిడిపి ఎంపీలు

తాము చిత్తశుద్ధితో పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటే మార్షల్స్ సహాయంతో తరిమి వేశారని తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆరోపించారు. రాష్ట్రం అగ్ని గుండంగా మారడానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కారణమన్నారు. కాంగ్రెసు పార్టీ తెలుగు వారి జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. సోనియా సీమాంధ్రకు శాశ్వత శత్రువుగా మిగిలి పోవద్దన్నారు. ఓట్లు, సీట్ల కోసమే విభజన అన్నారు.

English summary
Sanga Reddy MLA and Government Whip Jagga Reddy said on Tuesday that It will hard to Hyderabad after Telangana formation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X