వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్, ఆనంలకు బెదిరింపు: ఎమ్మెల్యేపై భార్య ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anam Ramanarayana Reddy - K Chandrasekhar Rao
నెల్లూరు: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్, సందేశాలు పంపించిన ఓ వ్యక్తిని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కావలి పట్టణంకు చెందిన పదిహేడేళ్ల బాలుడు నకిలీ ధ్రువపత్రాలతో ఫోన్ నెంబర్ తీసుకొని వారికి ఫోన్లు చేశాడు. ఎస్సెమ్మెస్‌లు పంపాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ రామకృష్ణ సోమవారం తెలిపారు.

ఇతడు నెల్లూరులోని ప్రముఖ మహిళలకూ బెదిరింపు ఎస్సెమ్మెస్‌లు పంపినట్లు తేలింది. ఇతడిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతామని ఎస్పీ చెప్పారు. సీమాంధ్రలో ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుండి ఆయన నేతలకు సందేశాలు పంపించడం ప్రారంభించాడు. తాను సందేశాలు పంపించానని అంగీకరించిన అతను, ఫన్ కోసమే వాటిని పంపించానని చెప్పాడు.

ఎమ్మెల్యేపై భార్య ఫిర్యాదు

కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణపై ఆయన భార్య సునీత మండవల్లి పోలీసు స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. తనపై హత్యాయత్నం చేశారని, గృహ హింసకు గురిచేశారని, మానసికంగా వేధించారని ఆరోపించారు. మొదటి భార్య చనిపోవటంతో పెద్దలను ఒప్పించి మరీ వెంకటరమణ తనను 1997 ఫిబ్రవరి 7న ద్వితీయ వివాహం చేసుకొన్నారని తెలిపారు. తమకు ముగ్గురు పిల్లలు(పూజిత, రమ్య, తేజ) కలిగారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొంతకాలం బాగానే ఉన్నారని, చేపల చెరువులు లీజుకు చేస్తూ, జడ్పీటీసీగా గెలుపొందిన నాటి నుంచి ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు. 2009లో కైకలూరు ఎమ్మెల్యేగా గెలుపొందాక, ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని ఆరోపించారు. తనకు పిల్లలు ఇద్దరేనంటూ ప్రభుత్వాన్ని మోసం చేశారన్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకొన్నారని ఆరోపించారు. 2012లో టైపు చేసిన పేపర్లు తీసుకొచ్చి, రివ్వాలర్‌తో భయపెట్టి మరీ సంతకాలు చేయించుకొన్నారన్నారు.

ఈ అన్యాయాన్ని తన తల్లిదండ్రులు ప్రశ్నించడంతో పిల్లలను, తనను ఇంటి నుంచి గెంటేశారని పేర్కొన్నారు. తన భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకొని, తనకు ప్రాణ రక్షణ కల్పించాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సునీత కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వివరణ ఇవ్వాల్సి ఉంది.

English summary
Police has arrested a boy, native of Kavali, for sending threatening messages to TRS chief K Chandrasekhar Rao and FM Anam Ramanarayana Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X