హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణుళ్లు: గోపికకు సర్దుతూ ముస్లిం మహిళ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. చిన్నారులు పలు పాఠశాలల్లో చిలిపి కృష్ణుడి వేషధారణలో అలరిస్తున్నారు. హిందువుల పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమికి ప్రాముఖ్యత ఉంది. జన్మాష్టమి రోజున ఉట్టి కొడతారు.

కృష్ణ జన్మాష్టమి, శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీక్రిష్ణుని చాలా పేర్లే ఉన్నాయి.

వాటిలో బాలగోపాలడు మిరయు కన్నయ్య లేదా క్రిష్ణయ్య అనే పేర్లు చాలా ప్రసిద్ది చెందినవి. కాగా, కృష్ణాష్టమిని పురస్కరించుకొని కృష్ణుడు, రాధ, గోపికలు, గోపాల బాలుర వేషంలో చిన్నారులు అలరించిన చిత్రాలు....

గోపికలు

గోపికలు

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఓ పాఠశాలలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. గోపిక వేషదారుల్లో చిన్నారులు ఉన్న దృశ్యం.

కృష్ణుడు

కృష్ణుడు

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఓ పాఠశాలలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. కృష్ణుడి రూపంలో అలరించిన చిన్నారి.

కోలాటం

కోలాటం

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని రాష్ట్ర రాజధానిలోని ఓ పాఠశాలలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. గోపిక వేషదారణలో చిన్నారులు చిన్ని కృష్ణుడితో ఆడుతున్న దృశ్యం.

కృష్ణుళ్లు - గోపికలు

కృష్ణుళ్లు - గోపికలు

హిందువుల పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమికి ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏటా చిన్నారులకు కృష్ణుడు, గోపికల వేషధారణ వేసి తల్లిదండ్రులు మురిసిపోతారు.

గోపికను సర్దుతూ...

గోపికను సర్దుతూ...

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హైదరాబాదులోని ఓ పాఠశాలలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఓ ముస్లిం యువతి గోపిక వేషధారికి సర్దుతున్న దృశ్యం.

ఉట్టికొడుతూ..

ఉట్టికొడుతూ..

శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది ఉట్టి కొట్టడం. హైదరాబాదులోని ఓ పాఠశాలలో కృష్ణుడి వేషంలో ఉన్న ఓ చిన్నారి ఉట్టి కొడుతున్న దృశ్యం.

కృష్ణుళ్లు - గోపికలు

కృష్ణుళ్లు - గోపికలు

హిందువుల పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమికి ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏటా చిన్నారులకు కృష్ణుడు, గోపికల వేషధారణ వేసి తల్లిదండ్రులు మురిసిపోతారు.

English summary
The birthday of Lord Krishna(Janmashtami) is celebrated with great devotion and enthusiasm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X