విభజన:లగడపాటిని చుట్టుముట్టిన వైనం, సిటీలో టెన్షన్

సమైక్యాంధ్ర కోసం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో లగడపాటి ఒక్కసారిగా అవాక్కయ్యారు. అనంతరం తేరుకున్న ఆయన తాను మొదటి నుండి సమైక్యానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. కాగా, లగడపాటి తనను చుట్టుముట్టిన కార్మికులతో చర్చించే ప్రయత్నం చేశారు. వారు అలాగే ఎంపిని అడ్డుకుంటే ప్రత్యేక వాహనంలో తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
హైదరాబాదులో ఉద్రిక్తత
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జలసౌధ, అర్థగణాంకాల శాఖ, భీమా భవన్, సచివాలయాలలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య పోటా పోటీ నెలకొంది. ఇరు ప్రాంత ఉద్యోగులు తెలంగాణకు, సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో గత కొద్దిరోజులుగా హైదరాబాదులోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా పోలీసులు ర్యాలీలకు అనుమతించడం లేదు.
బిజెపి నేతలను కలిసిన ఎపిఎన్జీవోలు
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, లాల్ కృష్ణ అద్వానీలను ఎపిఎన్జీవోలు బుధవారం న్యూఢిల్లీలో కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మద్దతు పలకాలని వారిని కోరారు. ఈ సందర్భంగా అద్వానీ.. సమస్యను సృష్టించింది కాంగ్రెసు పార్టీయేనని, ఆ పార్టీయే పరిష్కరించాలని ఎపిఎన్జీవోలతో చెప్పారు.












Click it and Unblock the Notifications