హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత: విశాలాంధ్ర మహాసభ X తెలంగాణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం విశాలాంధ్ర మహాసభ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ రోజు విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం తాము చేపట్టిన, చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రెస్ మీట్ పెట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్రాన్ని యథావిధిగా ఉంచేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో కొందరు తెలంగాణ విలేకరులు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కొంత ఉద్రిక్తత ఏర్పడింది. కొద్ది సేపట్లో అది చల్లారింది.

Vishalandhra Mahasabha

కాగా, ఖైరతాబాదులోని అర్థగణాంక శాఖ కార్యాలయంలో ఎపిఎన్జీవోల ధర్నా చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు.

హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తు కాదు: లగడపాటి

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తు కాదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. విజయవాడలో జరిగిన సమైక్యాంధ్ర గర్జనలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల నుండి వచ్చిందని, అంతిమంగా గెలిచేది సమైక్యవాదమే అన్నారు. తెలుగు తల్లిని కాపాడుకుంటామన్నారు. ప్రజాభిప్రాయానికి ఎవరైనా తలొగ్గాల్సిందేనన్నారు.

English summary
Telangana journalists obstructed Vishalandhra Mahasabha leaders at Somajiguda on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X